👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
నాకు మేళ తాళాలు మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతాలు వద్దు, మెడలో పూలమాలవేసి శాలువాలతో సన్మానించడం వద్దు, భగవంతుడి ముందు అందరూ సమానమే ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు.
వివరాల్లోకి వెళ్తే…

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న వేద సభ పూజా కార్యక్రమం దర్శించుకోవడానికి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ సోమవారం ఆలయానికి వెళ్లారు. ఆలయ కార్య నిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, అర్చకులు వేద పండితులు మేళ తాళాలతో స్వాగతించారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కార్యనిర్వాణా అధికారితో, భగవంతుడు ముందు అందరూ సమానమే, నేను ఎమ్మెల్యే అయినా ఆలయానికి వచ్చిన ప్రతిసారి ఈ స్వాగతాలు, సన్మానాలు నాకు వద్దు, నేను ఏమీ అనుకోను, ఆశీర్వచన మంటపంలో నాకు స్వామివారి శేష వస్త్రం తో సన్మానించడం లాంటి కార్యక్రమాలు ఇకముందు చేయవద్దని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు నేను స్వామి వారి దర్శనం కు రాక సందర్భంగా క్యూ లైన్ నిలిపివేసి భక్తులకు ఇబ్బందులు కలిగించవద్దని, ఆలయ సాంప్రదాయాలు, సమయపాలన పాటించాలని కార్యనిర్వహణాధికారిని ఆదేశించార

ఉచిత అన్నదానం తీరును పరిశీలించిన ఎమ్మెల్యే!

దేవాలయ పక్షాన భక్తులకు ఉచిత అన్నదానం నిర్వహిస్తున్న తీరును భక్తులు భోంచేస్తున్న భోజనశాలలోకి వెళ్లి ఎమ్మెల్యే పరిశీలించారు.
భక్తులను భోజనం నాణ్యత ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. స్వామివారి భోజనం రుచిగా శుచిగా ఉందా ? అంటూ భక్తులను ఎమ్మెల్యే అడిగారు

. వంటశాలను, వంట మనిషిని, అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో ఎమ్మెల్యే మాట్లాడారు. కొందరు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ వేతనాలు పెంచాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చారు.

ఆలయంలో ఎమ్మెల్యే తీరును భక్తులు,పట్టణ ప్రజలు,పలువురు ఆలయ ఉద్యోగులు అర్చకులు, వేద పండితులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.