నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లో నాడు పసుపు బోర్డు ? నేడు షుగర్ ఫ్యాక్టరీ ?

J.SURENDER KUMAR,

త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో ప్రత్యేకంగా నిజాంబాద్ పార్లమెంటు సెగ్మెంట్ లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ అంశం కీలకం కానున్నది. 2019 ఎన్నికల్లో నాటి సిట్టింగ్ ఎంపీ మాజీ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పసుపు బోర్డు ఏర్పాటు అంశం ఆమె ఓటమికి ప్రధాన కారణం కాగా, బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలిస్తే పసుపు బోర్డు ఏర్పాటు హామీ తో పాటు పలు అంశాలతో ఈ అంశం కీలకమైంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం
నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభించేందుకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు పరిశ్రమ ల శాఖా మంత్రి శ్రీధర్ బాబు, చైర్మన్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ లో ఇదే పార్లమెంట్ పరిధిలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డినీ, తోపాటు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ పరిశ్రమ శాఖ కార్యదర్శి మొత్తం పదిమందినీ నియమిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిజాం షుగర్ పునః ప్రారంభిస్తే నిజాంబాద్, మెదక్ జిల్లాలో రైతాంగానికి చక్కర సాగు రైతులకు రవాణా భారం తగ్గి, గిట్టుబాటు అవుతుందనే విస్తృతస్థాయి ప్రచారం పార్లమెంట్ ఎన్నికల్లో చేపట్టనున్నట్టు చర్చ. జనవరి 25న జగిత్యాల జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీధర్ బాబు అభినందన సమావేశంలో చక్కెర ఫ్యాక్టరీ పున ప్రారంభించాల్సిన అంశం తో పాటు రైతులకు వెసులుబాటు తదితర అంశాలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సభాముఖంగా మంత్రి శ్రీధర్ బాబుకు వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 15 స్థానాలను గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కా కార్యాచరణ ప్రణాళికకు శ్రీకారం చుట్టినట్టు సమాచారం. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, పసుపు బోర్డు స్థానంలో పసుపు స్పైసీ బోర్డును ఏర్పాటు చేపట్టినా నిజాంబాద్ పార్లమెంటు రైతాంగం నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో స్వయాన ప్రధాని నరేంద్ర మోడీ నిజాంబాద్ పర్యటనలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి రైతాంగంలో నెలకొన్న ఆందోళనలు, అనుమానాలకు తెరదించారు. ఈ నేపథ్యంలో ఈ పార్లమెంట్ స్థానం నుంచి ఈసారి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోటీకి మీనం మేషాలు లెక్కిస్తున్నట్టు మీడియాలో వస్తున్న కథనాల మేరకు బీఆర్ఎస్ నుంచి మరో అభ్యర్థి పోటీ చేయనున్నట్టు సమాచారం. సిట్టింగ్ బిజెపి అభ్యర్థి అభ్యర్థి ధర్మపురి అరవింద్ కు చెక్ పెట్టేందుకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ పున ప్రారంభం అంశం, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీగా ప్రచారంలో ప్రధాన అంశంగా మారనున్నది. దీనికి తోడు కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రముఖ విద్యాసంస్థల అధినేతను రంగంలో దించడానికి, నిజామాబాద్ పార్లమెంటుకు బీసీ అభ్యర్థిని రంగంలో దించడానికి కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంటు స్థానాలు గెలుపు కీలక బాధ్యతలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అప్పగించడంతోపాటు ఫిబ్రవరి 28 లోపు క్యాబినెట్ హోదా పదవినీ ఆయనకు కట్టబెట్టడం కోసం కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు చర్చిస్తున్నట్టు సమాచారం.