ఒక్క లైసెన్స్ రెండు మద్యం దుకాణాలుఅటవీ గ్రామాల్లో ఇష్టారాజ్యం!

👉 మామూళ్ల మత్తులోఎక్సైజ్  అధికారులు !

👉 గోదావరి తీరంలో జీరో మద్యం ?

👉 ఎక్సైజ్ నిబంధనలకు తూట్లు..

J.SURENDER KUMAR,

జగిత్యాల జిల్లాలో ఒక్క లైసెన్స్ తో రెండు ( బ్రాండీ) మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారు, నెల నెల వేలాది రూపాయల మామూళ్ల అందుకుంటున్న ఎక్సైజ్ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో ఊగి, తూగుతున్నారు తప్ప రెండు మద్యం దుకాణాలలో అమ్మకాలు వారి మత్తు కళ్ళకు కనపడడం లేదు.  గోదావరి నది తీరం గతంలో మావోయిస్టుల ప్రాబల్యం గల గ్రామాలలో ఎక్సైజ్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాలు ఏర్పడుతున్న ఎందుకు అని ప్రశ్నించలేని దుస్థితిలో సంబంధిత శాఖ అధికారులు ఉన్నారు అనే ఆరోపణలు ఉన్నాయి . గ్రామ గ్రామాన కొనసాగుతున్న రెండు, మూడు బెల్టు షాపులతో పాటు ఆ గ్రామాలలో పట్టపగలు నడి బజార్ లో వైన్స్ షాపులను పెడుతున్నారు. ఈ అదనపు వైన్ షాపులలో కొందరు ఎక్సైజ్ అధికారులకు భాగస్వామ్యం ఉందనే ఆరోపణలు ఉన్నాయి.

వివరాల్లోకి వెళితే…

జగిత్యాల జిల్లా ధర్మపురి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వైన్స్ పేరిట మద్యం దుకాణం, పర్మిట్ రూముకు  1-12-2023 నుంచి 30-11-2025 కాల పరిమితికి ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం G.O.Ms No. 86, ఆగస్టు ఒకటి, 2023 లో  2,620 మద్యం దుకాణాలకు 615 లేఔట్లకు నోటిఫికేషన్  జారీ చేసింది. ఈ షాపులలో  గౌడ కమ్యూనిటీకి 15%  షెడ్యూల్ క్యాస్ట్ కమ్యూనిటీకి 10%  షెడ్యూల్డ్ ట్రైబ్ కమ్యూనిటీకి 5% శాతం రిజర్వేషన్లు కేటాయించింది.  ఈ నోటిఫికేషన్ ద్వారా మద్యం దుకాణాలు పొందినవారు తమ నూతన మద్యం దుకాణాలలో 1-12-2023 నుండి 30-11-2025 వరకు కాల పరిమితి ఇస్తూ ఎక్సైజ్ శాఖ అనుమతించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మద్యం దుకాణాలకు దరఖాస్తు ఒక్కంటికి ₹ 2 లక్షల రుసుము వేలంలో దరఖాస్తుదారుడికి దుకాణం వచ్చినా రాకున్నా ₹ 2 లక్షలు తిరిగి చెల్లించబడని నిబంధన. ఈ నిబంధనలో మేరకు ప్రభుత్వానికి కేవలం దరఖాస్తుల రుసుము ద్వారానే ₹ 2.500 ( రెండువేల ఐదు వందల కోట్ల ) ఆదాయం వచ్చింది. 2011 జనాభా ప్రాతిపదికన ( ₹ 50, లక్షల పన్ను 5000 జనాభా పైగా ఉన్న ప్రాంతం లో షాపు నిర్వహణకు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది)

కమ్మనూరులో వైన్స్ పేరిట దుకాణం !

ఎక్సైజ్ లైసెన్స్ పొంది ఉన్న కొల్వాయి గ్రామ మద్యం దుకాణం కు దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో కమ్మునూర్ , గోదావరి నది ఒడ్డున గల  మూడు షట్టర్ ( దుకాణాలకు పెయింట్ తో వైన్స్ అనే బోర్డును)  ఏర్పాటుచేసి అక్కడ మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ఈ షాపుల గురించి ప్రశ్నించిన ప్రజలకు, యువతకు, కొల్వాయి గ్రామంలో మద్యం అమ్మకాలు లేకపోవడంతో, ఇక్కడ వైన్స్ దుకాణం పెట్టినట్టు నిర్వాహకులు చెపుతున్నట్టు సమాచారం. కమ్మనూరులో మద్యం షాపు ఏర్పాటు గురించి కొలువాయి ప్రజలు ప్రశ్నించిన వారికి అది బెల్ట్ షాపు ఎక్సైజ్ అధికారుల అనుమతితోనే అని నిర్వహకులు గ్రామస్తులకు వివరిస్తున్నట్టు సమాచారం.

కొలువాయి లో లైసెన్సుడు దుకాణం!

నిబంధనలకు తూట్లు..

మద్యం దుకాణాలలో సీసీ కెమెరాలు కచ్చితంగా ఉండాలి. మద్యం విక్రయాల బిల్లింగ్ యంత్రము. ఆ రసీదులు, బార్కోడ్. బ్రాండ్, అమ్మకం తేదీ, ఉండాలి,  రసీదును కొనుగోలుదారుకు ఇవ్వాల్సి ఉంటుంది.

ధర్మపురికి మంచిర్యాల్ డిపో మధ్యం !జగిత్యాల జిల్లాలో మెట్టుపల్లి, జగిత్యాల ఎక్సైజ్ శాఖ పరిధిలో దుకాణాలకు కరీంనగర్ లోని ఎక్సైజ్ డిపో నుంచి మద్యం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ధర్మపురి ఎక్సైజ్ పరిధిలోనీ వారు మంచిర్యాల్ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ డిపో నుంచి  మద్యం కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జోరుగా మద్యం అమ్మకాలు జరుగుతాయని భావించి కొందరు మద్యం వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి, నిర్మల్,  మహారాష్ట్ర నుంచి గోదావరి నది దాటి వచ్చే జీరో మద్యం  నిలువలు ఇతర ప్రాంతాల పంపిణీ కోసం కమ్మునూర్ కేంద్రంగా వైన్స్ ముందస్తుగా ఏర్పాటు చేసినట్టు చర్చ కొనసాగుతున్నది. ఈ అంశంపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఏమి చేయనున్నారో అని ప్రజలు వేచి ఉన్నారు