ఆన్లైన్  సరుకుల కొనుగోలు విధానం  ఆలయాల ఆదాయ దోపిడీకి మార్గం!

👉 అధికారులకు, వ్యాపారికి అదనపు ఆదాయ మార్గం !


👉 కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న వైనం!


👉 ఆన్లైన్ టెండర్ కు  పత్రిక ప్రకటనలు జారీ!


👉 గత ప్రభుత్వ హాయంలో అడిగేవారు లేరు.. అడ్డుకునే వారు లేరు!


👉 సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆన్లైన్ టెండర్ కు అనుమతి ఇస్తుందా ? అడ్డుకుంటుందా ?


👉 ఆలయాల ఆదాయం కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందో ?  లేదో ?


J. SURENDER KUMAR

ప్రముఖ ఆలయాలలో కోట్లాది రూపాయల ఆదాయం హారతి కర్పూరంలా ఆవిరవుతున్నది.  ఆన్లైన్ టెండర్ సరుకుల కొనుగోలు విధానంను  అడ్డుపెట్టుకొని కొందరు అధికారులు, వ్యాపారులు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. తెలంగాణ లో కొలువై ఉన్న ప్రముఖ ఆలయాల ఆదాయం  పట్ట పగలు, నిట్టనిలువు దోపిడికి గురి అవుతున్న,  అడిగేవారు, అడ్డుకునేవారు అగుపించడం లేదు. సంవత్సరాల తరబడి ఆన్లైన్ టెండర్ ముసుగులో దోపిడి కొనసాగిస్తున్న వారిని ప్రశ్నించినా , అభ్యంతరాలు తెలిపినా వాళ్లను, గత ప్రభుత్వంలో ఓ కీలక నేత, దేవాదాయ శాఖ కు చెందిన కీలక అధికారులు, నయానో, భయానో, లేదా పచ్చ నోట్లతో ప్రసన్నం చేసుకుంటూ, తమ దోపిడిని గత పది సంవత్సరాలుగా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు.  డైనమిక్ ప్రజా ప్రభుత్వ  సీఎం రేవంత్ రెడ్డి   జోక్యం చేసుకొని  రాష్ట్రంలో కొలువై ఉన్న దేవుళ్ళ ఆదాయం కాపాడడంతోపాటు, ఆన్లైన్ టెండర్ల ద్వారా సరుకులో కొనుగోలు విధానం రద్దు చేయాల్సిందిగా తెలంగాణ ప్రజలు, భక్తజనం ముక్తకంఠంతో సీఎంను, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖను  కోరుతున్నారు.

వివరాల్లోకి వెళితే!

రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలైన యాదాద్రి, భద్రాచలం, బాసర, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, భద్రకాళి, కొమురవెల్లి, సికింద్రాబాద్ లక్ష్మీ గణపతి ఆలయం తదితర ప్రముఖ ఆలయాలలో ఆన్లైన్ టెండర్ల ద్వారా సరుకులు కొనుగోలు గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నది.
ఆయా ఆలయాల్లో కొలువై ఉన్న దేవుళ్లకు నిత్య నివేదన, భక్తులకు ప్రసాదాలు, స్వామి వారి ప్రసాదాల విక్రయం, ఉచిత అన్నదానం, తదితరాల అవసరాల నిమిత్తం, పంచదార, బియ్యం, నూనె, నెయ్యి, పప్పు ఉప్పు  తదితర సరుకులు కొనుగోలు చేస్తుంటారు.

ఆర్థిక సంవత్సర కాలానికి సరుకులు !   ధరల వివరాలు గోప్యం !

ఆలయానికి సరుకులను సప్లై చేసేవారు, ఆన్లైన్ టెండర్ ద్వారా ధరలను కొట్ చేయాల్సి ఉంటుంది. వాటి వివరాలు ఆలయ ఈవోకు, టెండర్ దారుడికె తెలుస్తుంది తప్ప ఇతరులకు తెలిసే అవకాశం లేదు.  (కొందరు అధికారులు, వ్యాపార సంస్థ లు రూపొందించిన టెండర్ నియమ నిబంధనలు  ప్రకారం రాష్ట్రంలో కేవలం మూడు సంస్థలే టెండర్ లో పాల్గొనే అర్హతలు కలిగి ఉన్నారు అనే ఆరోపణలు ఉన్నాయి)  గత కొన్ని సంవత్సరాలుగా  మూడు సంస్థలే ఆన్లైన్ టెండర్ లో పాల్గొనడం అందులో ఒకరు తక్కువ కోట్ చేసి సరుకుల సప్లై టెండర్ దక్కించుకోవడం మిగతా రెండు సంస్థలు వారి  (బినామీ, సూట్ కేస్ సంస్థలు )అనే ఆరోపణలు ఉన్నాయి.


ఈ ప్రొక్యూర్ మెంట్  టెండర్ నిబంధనలు కొన్ని ఇలా!
👉 టెండర్ దారుడు, ఫుడ్ గ్రేన్ వ్యాపారంలో రిజిస్టర్ అయి ఉండాలి, కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి!
👉 EMD, డబ్బులు. ₹ 15 లక్షల రూపాయలు ఆయా ఆలయ కార్యనిర్వహణాధికారి పేరిట నేషనల్ బ్యాంకులో డిడి తీయాలి. టెండర్ పొందినవారు సంవత్సర కాల పరిమితి ముగిసిన తరువాత EMD డబ్బులు తిరిగి పొందడానికి అవకాశం!
👉 టెండర్ షెడ్యూల్ ఫామ్ ధర  ₹ 3000/-
👉 బియ్యం, పంచదార, శనగపప్పు, ఖజు ,ఎండు ఖర్జూర, నూనెల తదితర వ్యాపారంలో సాలిన కనీసం ₹ 10 కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు గత మూడు ఆర్థిక సంవత్సరాల కాలం పాటు కలిగి ఉండాలి!
👉 గ్రేడ్ వన్ ఆలయాలనికి సాలీనా ₹ 5 కోట్లు, వ్యాపార లావాదేవీలు కలిగిన వారు అర్హులు, అసిస్టెంట్ కమిషనర్ స్థాయి ,నుంచి డిప్యూటీ కమిషనర్  హోదా గల ఆలయాలకు ₹ 10 కోట్ల వ్యాపార లావాదేవీలు కలిగి ఉండాలి.
👉 రీజినల్ జాయింట్ కమిషనర్ హోదా గల ఆలయాలకు ₹ 25 కోట్ల వ్యాపార లావాదేవీలు కలిగి ఉన్నవారే ఆయా ఆలయాల్లో టెండర్లు పాల్గొనడానికి అర్హతగా ప్రకటించారు.
👉 ₹ 5.  ₹10,  ₹ 25  కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలకు సంబంధించి ప్రతి ఆర్థిక మూడు సంవత్సరములకు వాణిజ్య పనుల శాఖ జారీ చేసిన ధృవీకరణ పత్రాన్ని ( సర్టిఫికెట్ ) జతపరిచాల్సి ఉంటుంది. ఈ ధ్రువీకరణ జతపరిచాల్సి ఉంటుంది .
👉 మూడు సంవత్సరల కాల అనుభవం,  సరఫరా సక్రమంగా చేస్తున్నాడంటూ ప్రభుత్వ సంస్థలచే ధ్రువీకరణ పత్రం తప్పనిసరి  సమర్పించాల్సి ఉంటుంది.
👉 సంస్థ రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రం, జీఎస్టీ రిజిస్ట్రేషన్, ఇన్కమ్ టాక్స్ కాపీ, వ్యాపారంలో లాభనష్టాల ఆడిట్ నివేదిక,. మూడు ఆర్థిక సంవత్సర అమ్మకాలు, వ్యాపార లావాదేవీల,  వివరాలు దానిపై కమర్షియల్ టాక్స్ అధికారి అట్టేస్టేషన్  చేయించి జతపరిచాల్సి ఉంటుంది.
👉 ఆగా మార్క్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫుడ్ గ్రేన్ వ్యాపారం బియ్యం,పప్పులు, హోల్సేల్ ఖజు, పల్లి గింజలు, ఆయిల్ గింజలు, FSSAI లైసెన్స్ సమర్పించాలి.
👉 200 మెట్రిక్ టన్నుల, బియ్యం 100 మెట్రిక్ టన్నుల, శనగపప్పు  6 మెట్రిక్ టన్నుల ఖాజూ (రెండు పలుకులు గలది).20 మెసేజ్ ఎండుఖర్జూర పండ్లు, పలుకులు (రెండు పలుకులు కలిగి ఉన్నది) 2 మెట్రిక్ టన్నుల చింతపండు, 150. మెట్రిక్ టన్నుల పంచదార, 6 మెట్రిక్ టన్నుల ఎండు ఖర్జూర, గత రెండు ఆర్థిక సంవత్సరాలలో సరఫరా చేసినట్టు చార్టెడ్ అకౌంటెంట్ ధ్రువీకరించిన పత్రం జతపరిచాల్సి ఉంటుంది.
👉 ఆలయాలకు సరఫరా చేసే సామాగ్రి టెండర్ లో అర్హతలు నిబంధనలు (స్టాక్) తదితర నిబంధనల మేరకు రాష్ట్రంలోని  33 జిల్లాకు. చెందిన ఏ ఒక్క వ్యాపారి గాని, వ్యాపార సంస్థ గాని  టెండర్లు పాల్గొనలేదని సమాచారం.
👉 హైదరాబాద్ కు చెందిన ఓ సంస్థ తన మరో రెండు బినామీ సంస్థలతో ఆన్ లైన్ టెండర్ లో పాల్గొని కైవసం చేసుకుంటున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా  ఆలయాలకు  సరఫరా అవుతున్న సామాగ్రి అధిక ధరలు ఉండగా అవే సామాగ్రి మార్కెట్లో తక్కువ ధరలకు అందుబాటులో ఉన్న వాటిని కొనుగోలు చేయకుండా సరఫరా చేసే సంస్థకు అధిక ధరలు చెల్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
👉 సరుకుల వివరాలు, క్వాలిటీ, క్వాంటిటీ సంబంధిత ఆలయాల కార్యనిర్వాహణాధికారులకు, సరఫరా చేసే సంస్థకు మాత్రమే తెలుసని ధర్మకర్తలకు, ఉద్యోగులకు తెలిసే అవకాశం లేకుండా  కొనసాగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
👉 ప్రతి నెల 3 నుంచి 5 లక్షలకు పైగా ఆదాయానికి గండి!
ప్రత్యేకంగా ప్రముఖ ఆలయాలు దాదాపు  ₹ 20 లక్షలకు  పైగా ప్రతినెల ప్రసాదాల సరుకుల కొనుగోలు లో.₹ 3 లక్షల నుండి 5 లక్షలకు పైగా ఒక్కొక్క ఆలయం సరుకుల కొనుగోలులో మార్కెట్ ధరల కన్నా అధిక ధరలు చెల్లిస్తూ ఆలయాల ఆదాయానికి గండి కొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇది ఇలా ఉండగా కొన్ని ఆలయాల అధికారులు 2025 ఆర్థిక సంవత్సరానికి గాను ఆన్లైన్ టెండర్ల ప్రకటనలు జారీ చేశారు, చేస్తున్నారు.

కాలేశ్వరం ఆలయ ప్రకటన

కాలేశ్వరం, కొండగట్టు, దేవస్థానం వారు సరుకుల కొనుగోలు. కోసం పత్రికలలో ప్రకటనలు ఇచ్చారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం వారి సరుకుల కొనుగోలు ఆన్లైన్ టెండర్

కొండగట్టు ఆలయ ప్రకటన

మంగళవారం. ఓ పత్రికలో ఇదే ఆలయం కు సంబంధించిన షీల్డ్ టెండర్ ప్రకటన మంగళవారం మరో దినపత్రికలో ప్రచురితడు కావడంలో. ఆంతర్యం అంతు పట్టడం లేదు. ఆలయాల ఆదాయం నుంచి సాలీనా కొట్లాది రూపాయలు వ్యయం చేసి కొనుగోలు చేసే సరుకుల టెండర్ ప్రకటన చిన్నదిగా కొన్ని టెండర్లలో కలిపి ప్రచురించడం ఆలయ

కాలేశ్వరం ఆలయ షీల్డ్ టెండర్ ప్రకటన మంగళవారం మరో పత్రికలో ప్రచురితం

అధికారులు అతి జాగ్రత్త చర్యల్లో ఒక భాగంగా చర్చ.
యాదాద్రి, వేములవాడ, బాసర, ధర్మపురి, తదితర ఆలయాలు ఈనెల 20 లోగా టెండర్ ప్రకటన జారీ చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి సరుకుల సప్లయర్ టెండర్ కాలపరిమితి 2024మార్చి 31 వరకు ఉంది.

👉త్వరలో పార్ట్. — 2

(ఉమ్మడి రాష్ట్రంలో విజిలెన్స్ నివేదిక, రాష్ట్రం ఏర్పడిన 46 రోజులకే సరుకుల కొనుగోలు సర్కులర్ జారీ ఉత్తర్వులు అడ్డుపెట్టుకొని .. ఆన్లైన్ టెండర్)