పంచాయతీ భవనాలను  ప్రారంభించడం సంతోషంగా ఉంది..

👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

👉 ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన…

J.SURENDER KUMAR,

నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మమల్ని భాగస్వాములను చేసినందుకు చాలా సంతోషంగా ఉందని, ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి మండలం ఆరెపల్లి, బుర్గుపల్లె గ్రామలలో  నూతన గ్రామ పంచాయతీ భవనాలను  సోమవారం  ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తామని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిధి పెంపు వంటి హామీలను అమలు చేయడం జరిగిందన్నారు.  మిగిలిన వాటి అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉందని, ప్రభుత్వం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమి  మేరకు ప్రతి గ్యారెంటీని అమలు చేసి తీరుతామని లక్ష్మణ్ కుమార్ అన్నారు. అరిపెల్లి, బుర్గుపల్లే గ్రామాలకు సంబందించిన పలు సమస్యలను  త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో ధర్మపురి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సంఘనభట్ల దినేష్, సర్పంచ్ బోర్లకుంట కమల, ఉప సర్పంచ్ సుధాకర్, ఎంపిటిసి రవిత, జెడ్పిటిసి బత్తిని అరుణ, ఎంపీపీ చిట్టిబాబు, DCMS చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, బూరుగుపల్లి సర్పంచ్ కంది తిరుపతి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు చిలుముల లక్ష్మణ్, ధర్మపురి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సింహరాజ్ ప్రసాద్. సుముక్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పాఠశాల సందర్శన !


ఆరేపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలకు సంబంధించిన పలు సమస్యలను పాఠశాల ఉపాధ్యాయ బృందం ఎమ్మెల్యే  దృష్టికి తీసుకెళ్లగా వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు.
పరామర్శ..


ధర్మపురి మండలం దొంతాపూర్ గ్రామానికి చెందిన దుంపేట లక్ష్మి  అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా ఎమ్మెల్యే లక్ష్మి  కుటుంబానికి పరామర్శించారు.


మన ఊరు మనబడి !


గొల్లపల్లి మండలం ఇస్రాజ్ పల్లి గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా నూతన పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిశాంత్ రెడ్డి, సర్పంచ్ గంగాధర్, ఉప సర్పంచ్ వెంకటేష్, విద్యశాఖ అధికారులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి, మహేష్, పాఠశాల ఉపాధ్యాయులు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


శంకుస్థాపన..


గొల్లపెల్లి మండల కేంద్రంలో  నూతనంగా నిర్మించబోయే మార్కెట్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు
ఎల్ఓసి అందజేత!


గొల్లపెల్లి మండలం రాఘవ పట్నం గ్రామానికి చెందిన సురేందర్ రెడ్డి కి హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం.₹ లక్ష రూపాయల LOC ని ఎమ్మెల్యే అందించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిశాంత్ రెడ్డి, సర్పంచ్ సత్యనారాయణ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి, మహేష్, విజయ్, శ్రీనివాస్, దిలీప్, శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
డ్రైనేజీ పనులకు భూమి పూజ!


గొల్లపెల్లి మండలం బీం రాజ్ పల్లె గ్రామంలో
ఈ సందర్భంగా ఎస్సీ కాలనీలో నూతన డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.అనంతరం గ్రామంలోని నూతన  వైకుంఠధామన్ని ప్రారంభించారు..


ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిశాంత్ రెడ్డి, సర్పంచ్ సత్యనారాయణ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి, మహేష్, విజయ్, శ్రీనివాస్, దిలీప్, శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కల్చరల్ మీట్ కార్యక్రమంలో..


ధర్మపురి పట్టణంలో స్థానిక టీటీడీ ఫంక్షన్ హాల్ లో సోమవారం రోజున నిర్వహించిన అంగ్లోవేదిక్ కాన్వెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి చెందిన కల్చరల్ మీట్ కార్యక్రమానికి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


ఈ కార్యక్రమంలో ధర్మపురి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సంఘనభట్ల దినేష్. వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలేందర్ రెడ్డి. ధర్మపురి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సింహరాజ్ ప్రసాద్. సుముక్. పాఠశాల యాజమాన్యం మరియు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.