పంటలకు సాగు ప్రజలకు తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం!

👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్!

J.SURENDER KUMAR,

ధర్మపురి నియోజకవర్గ రైతుల పంట పొలాలకు సాగునీరు, ప్రజలకు తాగు నీరు అందించడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మారం మండలం నందిమేడారం రిజర్వాయర్ ను ఇరిగేషన్ శాఖ అధికారులు, మండల నాయకులతో కలిసి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం సందర్శించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండ శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పరిస్థితి వివరించానని అన్నారు. సీఎం వెంటనే స్పందించి సాగు తాగునీటి అంశంలో విచారణ జరిపి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారని చెప్పారు.
రిజర్వాయర్ లో నీటిమట్టం తక్కువగా ఉండటం వల్ల సకాలంలో నీటిని అందించలేక పోతున్నామని అన్నారు.

SRSP D 83 కెనాల్ ద్వారా మేడారం మరియు ఇతర గ్రామలకు నీటి సౌకర్యం కల్పించాలని కోరడం జరిగిందనీ, నియోజకవర్గ ప్రజలకు త్రాగు నీరు, సాగు నీరు అందించే విషయంలో ఎక్కడ రాజీపడే ప్రసక్తి లేదని,.త్వరలోనే ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తానని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు. నీటి . సమస్యపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్ళి సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు