పెండింగ్ చాలాన్స్ చెల్లింపు గడువు పెంపు!

👉ఫిబ్రవరి 15వ తేదీ వరకు..

👉జగిత్యాల ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ,

J.SURENDER KUMAR,

పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై రాయితీతో చెల్లించే గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.
గతంలో విధించిన గడువు నేటితో ముగుస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి 15 వరకు పొడిగిస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 25 వరకు ఉన్న చలాన్లపై మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. బైక్, ఆటోలకు 80%, ఆర్టీసీ బస్సులకు 90%, ఇతర వాహనాలకు 60% డిస్కౌంట్ ప్రకటించింది.ఈ యొక్క రాయితీ అవకాశాన్ని వాహనదారుల సద్వినియోగం చేసుకుని, వాహనాలపై ఎలాంటి జరిమానా లేకుండా చూసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.