పెండింగ్ లో ఉన్న ఎస్సీ, ఎస్టి  అట్రాసిటి కేసులు త్వరగా పరిష్కరించండి!

👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్!

J.SURENDER KUMAR,

జిల్లాలో వివిధ స్థాయిలలో పెండింగులో ఉన్న ఎస్సీ ఎస్టీ. అట్రాసిటి కేసులు  పరితగతిన పరిష్కరించడానికి  అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

జగిత్యాల జిల్లా షెడ్యూల్డు కులముల అభివృద్ధి శాఖ, ఆధ్వర్యములో గురువారం  కలెక్టర్, జగిత్యాల  అధ్యక్షతన డిస్ట్రిక్ట్ లెవెల్ విజిలెన్స్ అండ్ మానిటరింట్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశము లో అట్రాసిటీ కేసులను జాప్యము లేకుండా త్వరగా పరిష్కరించి, బాదితులకు సత్వర న్యాయం అందించాలని కలెక్టర్  షేక్ యాస్మిస్ బాషా, ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లాలో  అట్రాసిటి కేసుల నమోదు ఆయా కేసుల పరిష్కారానికి అధికారులు తీసుకున్న చర్యలు మరియు బాధితులకు అందించవలసిన లబ్ది పై కమిటీ సభ్యులు చర్చించారు

 

ఎస్సీ ఎస్టీలకు లకు సంబందించిన భూములను వేరే ఇతర కులాలకు చెందినవారు కబ్జా చేయకుండా చూడాలని మరియు  అట్రాసిటి కేసులను త్వరితంగా పరిష్కంచాలని ఎమ్మెల్సీ  టి.జీవరెడ్డి  అధికారులను ఆదేశించినారు.
ప్రతి నెల జరిగే పౌర హక్కుల దినోత్సవంలో సంబంధిత ఆర్.డి.ఒ., తహశీల్దారు, ఎస్.ఐ.లు  మరియు మండల స్థాయి అధికారులు తప్పకుండ హాజరు కావాలని శ్రీమతి షేక్ యాస్మిస్ బాషా,  అధికారులను ఆదేశించినారు.