ప్రశ్నించే గొంతుకతో పాటు పరిష్కారం చూపే బాటను అవుతా !

👉ఉద్యోగుల విశ్రాంత జీవితానికి భద్రత కల్పిస్తాం.!

👉ఓ పీ ఎస్ విధానం అమలుకు కృషి.!

👉పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి !

J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఆదివారం పీఆర్టీ టీఎస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఉపాధ్యాయ సంఘ నాయకులు ఆనంద్ రావు, అమర్ నాథ్ రెడ్డి తదితరులతో కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ..
గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో
ప్రభుత్వ నిర్లక్ష్యమే విద్యార్థుల సంఖ్య తగ్గ కారణం. కేజీ టు పీ జీ ఉచిత విద్య ప్రకటనలకే పరిమితం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాల్సి ఉండగా. క్రమబద్ధీకరణ నెపం తో పాఠశాలలు మూసివేశారు. నిరుపేదలకు విద్యను దూరం చేశారు.
ఉపాద్యాయులు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పై నిధులు, నియామకాలు, నీళ్ళ లో వివక్షను ప్రజలకు వివరించి, ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
ఓ పీ ఎస్ విధానం అమలు కు విధాన పరమైన నిర్ణయం చేపడుతాం. ఉద్యోగుల విశ్రాంత జీవితానికి భద్రత కల్పిస్తాం.
317 జోనల్ విధానం అమలుతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జోనల్ విధానాన్ని సమీక్షించి, ఉమ్మడి జిల్లాలప్రాతిపదికన జోన్ గా ఏర్పాటు చేసేలా కృషి చేస్తాం..శాసన మండలిలో జోనల్ విధానం పై సమీక్షించాలని కోరారని గుర్తు చేశారు.
పాఠశాలలో స్కావెంజర్ ను తొలగించడంతో ఉపాద్యాయులు ఇబ్బందులు పడుతున్నారు.
పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తాం. కేరళ రాష్ట్రంలో మాదిరిగా ముందస్తుగా నియామక ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్తాను.
ప్రభుత్వ పాఠశాలల్లోనే నైపుణ్యం సాధించిన బోధకులు ఉన్నారు. నియామకాలలోలేని టెట్ ను పదోన్నతుల్లో ప్రవేశపెట్టడం సరికాదు.
ఉపాధ్యాయుల ప్రతినిధిగా సమస్యల పరిష్కారం కోసం సీఎం దృష్టికి తీసుకెళ్తా అని హామీ ఇచ్చారు. గవర్నర్ టీఎస్ పీఎస్పి సభ్యుల రాజీనామా ఆమోదించడం జాప్యం తో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
గవర్నర్ చొరవ చూపీ, ఉద్యోగ నియామకాల భర్తీ ప్రకియకు మార్గం సుగమం చేయాలని జీవన్ రెడ్డి గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. సమస్యలను లేవనేత్తడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకు కృషి. చేసే బాధ్యత తీసుకుంటానని ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ జీవ న్ రెడ్డి భరోసానిచ్చారు.
కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు యాళ్ళ అమర్ నాథ్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బోయినపల్లి ఆనందరావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు
చంద్రప్రకాష్, మహేష్, రవి కుమార్, శ్రీనివాస్ రెడ్డి, పొన్నం రమేష్, మల్లారెడ్డి, రాజశేఖర్, సురేఖ, జమున, జయప్రద, వసంత, రాధాలక్ష్మి 18 మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, జిల్లా బాధ్యులు పాల్గొన్నారు.