పుస్తకావిష్కరణ చేసిన మంత్రులు శ్రీధర్ బాబు, కొండ సురేఖ !

J.SURENDER KUMAR,

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ ప్రాంగణములో బుధవారం ధర్మపురి క్షేత్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు డా. గొల్లపెల్లి గణేశ్ రచించిన ‘ అంతర్జాలంలో తెలుగు భాషాసాహిత్యాలు ‘ అనే పుస్తకాన్ని తెలంగాణ సాంకేతిక శాఖా మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు దేవాదాయ శాఖా మంత్రి శ్రీమతి కొండ సురేఖ పుస్తకావిష్కరణ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ కుమార్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి , సంస్కృత అకాడమీ డైరెక్టర్ కషోజల నీలకంఠం , దేవస్థాన చైర్మన్ ఇందారపు రామన్న పీసీసీ సభ్యులు సంగణభట్ల దినేష్ పాల్గొన్నారు.


నేటి డిగ్రీ, పిజి స్థాయి విద్యార్థులకు ఉపయోగ పడేలాగ అంతర్జాలంలోని వెబ్ సైట్లు, బ్లాగులు, సామాజిక మాధ్యమాల్లో (ఫేస్బుక్, యూట్యూబ్) జరుగుతున్న తెలుగు భాష సాహిత్యాల అభివృద్ధిని గురించి పుస్తకంలో చర్చించడం పట్ల పలువురు రచయితను అభినందించారు. మంత్రులు శ్రీధర్ బాబు కొండా సురేఖ రచయిత డాక్టర్ గొల్లపల్లి గణేష్ ను శాలువాతో సన్మానించారు.
బ్రాహ్మణ సంఘం పక్షాన మంత్రి శ్రీధర్ బాబు సన్మానం !


మంత్రి శ్రీధర్ బాబును స్థానిక బ్రాహ్మణ సంఘ అధ్యక్ష కార్యదర్శులు రామయ్య, గిరిధర్, సంఘ్ సభ్యులు ఘనంగా సన్మానించారు.