👉అయోధ్యలో ప్రతిష్ట మహోత్సవ సందర్భంగా
.J.SURENDER KUMAR,
కొన్ని గంటలలో భవ్య అయోధ్య రామ మందిరంలో రామ్ లల్ల విగ్రహ ప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో శ్రీరామచంద్రమూర్తి వనవాస సమయంలో కికారుణ్య అటవీ ప్రాంతమైన ధర్మపురి క్షేత్ర గోదావరి నది తీరంలో సీతా సమేతంగా సమేతంగా నడయాడినట్టు అనాదిగా ఈ క్షేత్రంలో కొనసాగుతున్న కథనం.

పవిత్ర పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో వందలాది సంవత్సరాల నుండి వంశపార్యం పర గా గోదావరి నది తీరంలోగల శ్రీరామాలయం లో తాడూరి వంశీయులు నిత్యం పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాలు, శ్రీ సీతారాముల కళ్యాణం, ధనుర్మాసం పూజాది కార్యక్రమాలు, అనాదిగా క్రమం తప్పకుండా ఈ ఆలయంలో వారు కొనసాగిస్తున్నారు.శ్రీరాముడు ఈ ప్రాంతంలో నడయాడినట్టుగా కథనంలో..

నువ్వు నువ్వు మీసాల శ్రీరామచంద్రమూర్తి
ధర్మపురి లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ఎడమవైపు అతి పురాతనమైన శివాలయం ఉంది. ఈ ఆలయానికి ‘శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంగా’ పేరు ( వనవాసంలో శ్రీరామచంద్రమూర్తి నిత్యం శివుడికి పూజ చేసుకునేవాడు అనేది పురాణ కథ) ఈ నేపథ్యంలో ఈ ఆలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధిగాంచింది అందులో పూజలు అందుకుంటున్న శివలింగాన్ని ‘సైకత లింగం’ ( ఇసుకతో చేసిన లింగం) అంటారు. దీనికి ఓ కథనం ప్రాచుర్యంలో ఉంది. శ్రీరాముడు శివుడి అభిషేక ముహూర్తానికి శివలింగం కోసం హనుమంతుడిని కాశి క్షేత్రం నుండి శివలింగాన్ని తెమ్మని ఆదేశించినట్టు కథనం. ఆంజనేయుడు కాశి క్షేత్రానికి వెళ్లి శివలింగాన్ని తీసుకురావడంలో ముహూర్తానికి కొన్ని ఘడియలు ఆలస్యం కావడంతో. శ్రీరామచంద్రమూర్తి ఇసుకను తన రెండు చేతులతో లింగాకారం చేసి నొక్కడంతో లింగాకారం ఆవిర్భవించింది. ఈ శివలింగ ప్రతిమకు రెండు వైపులా బొటనవేలు ముద్రలు నేటికి అగుపిస్తాయి. శివలింగ ప్రతిష్ట కార్యక్రమం కాగానే ఆంజనేయుడు కాశీ నుంచి శివలింగాన్ని తీసుకొని రాగా, అప్పటికే శివలింగ ప్రతిష్ట చేయడంతో తాను తెచ్చిన శివలింగం ఇక్కడే వదిలేసి ఆంజనేయుడు కోపంతో గోదావరి నది వైపు వెళ్లినట్టు పురాణ కథ. ఆంజనేయుడికి కోపం వచ్చిన విషయాన్ని గ్రహించిన శ్రీరామచంద్రమూర్తి, శివాలయం గర్భగుడి ప్రాంగణంలోనే ఆంజనేయుడు కాశి క్షేత్రం నుంచి తెచ్చిన శివలింగాన్ని ఈశాన్యం వైపు ప్రతిష్టించాడు అనేది కథనం. ఓకే గర్భాలయంలో రెండు శివలింగాలు ఉన్న ఏకైక ఆలయం , ధర్మపురిలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలోనే అనిపించడం ప్రత్యేకత.
నుగు మీసాల యువకుడు శ్రీరామచంద్రుడు !
నల్లని శిలపై సీతాదేవి పట్టాభిషేకం సందర్భంగా పక్కన లక్ష్మణుడు

గోదావరి నది తీరంలో గల శ్రీరామాలయం లో శ్రీరామచంద్రమూర్తి సీతా సమేత లక్ష్మణుడు, పరివారం గా కొలువై ఉన్న సుందర మనోహరమైన స్వామివారి మూలవిరాట్ విగ్రహం నల్లని కృష్ణ శిలాపై ఉంది.( ప్రస్తుతం అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట చేయనున్న విగ్రహం కూడా నల్ల క్రిష్ణ రాయి పైనే ఉండడం విశేషం) ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి విగ్రహానికి మీసాలు ఉండడం తో స్వామివారు యవ్వనంలో వనవాసం కొనసాగిస్తు మహారాష్ట్ర గడిచిరోలి, భద్రాచలం, గోదావరి నది పరివాహక ప్రాంతంలో శ్రీరామచంద్రమూర్తి తన వనవాసం లో నడయాడినట్టు కథనం. దీనికి తోడు ఈ రామాలయానికి ఎదురుగానే దాదాపు ఫర్లాంగు దూరంలో ‘ హనుమాన్ గడ్డపై’ శ్రీ ఆంజనేయ స్వామి గుడి శ్రీ రామాలయానికి అభిముఖంగా ఉంది. శివాలయం నుండి కోపంతో వెళ్లిన శ్రీ ఆంజనేయ స్వామి గడ్డపై కూర్చుండి శ్రీరామచంద్రుని ఆలయం చూస్తున్నట్టు కథనం.
దీనికి తోడు ఈ క్షేత్రం చుట్టూ దక్షిణం వైపు గండి హనుమాన్, పడమటి వైపు ఆక్సై పల్లిలో హనుమాన్, ఈ క్షేత్రం చుట్టూ రాతిపై వెలసిన హనుమాన్ విగ్రహాలు అనేకం ఉన్నాయి.
దీంతోపాటు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువైన ఆలయంలో ప్రాంగణంలో చుట్టూరా పదుల సంఖ్యలో హనుమాన్ విగ్రహాలు స్వామివారికి రక్షణగా, లేదా స్వామి వారి దర్శనం కోసమో తెలియదు కానీ ప్రతిష్టించబడి ఉన్నాయి. గత ఐదు శాబ్దాల క్రితం వరకు ధర్మపురి క్షేత్రంలో ఒకే ఒక రామాలయం గోదావరి నది తీరంలోనిది.
అపురూపమైన నల్లని శిలపై సీతాదేవిని ఒడిలో కూర్చున్న పెట్టుకున్న శ్రీరామచంద్రమూర్తి విగ్రహం.

వందలాది సంవత్సరాల క్రితం పందిరి కింద ఉండే రామచంద్ర మూర్తి కి ప్రముఖ వేద శాస్త్ర పండితుడు స్వర్గీయ తాడూరి బాలకృష్ణశాస్త్రి, నాన్నగారు ఆలయ నిర్మించారు అని. స్వాతంత్ర సమరయోధుడు స్వర్గీయ మాజీ మంత్రి కెవి కేశవులు తండ్రి అక్కపల్లి రామాలయం ముందు మంటపాన్ని నిర్మించినట్టు ఆలయ వంశపార్యం పర పూజారి తాడూరి రఘునాథ్ తెలిపారు.
అయోధ్యలో సోమవారం జరుగుతున్న బాల రాముడి ప్రతిష్ట కార్యక్రమం పురస్కరించుకొని స్థానిక శ్రీ రామాలయంలో ప్రత్యేక పూజారి కార్యక్రమాలు అభిషేకాలు, ప్రత్యేక ఉత్సవంతో పాటు తాడూరి వంశీయులు స్వామివారి ప్రసాదంగా మిఠాయిలను పంపిణీ చేస్తూ తమకు అయోధ్యలో శ్రీ రాములవారి ప్రతిష్ట ఎనలేని ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందని తాడూరి రఘునాథ్ శర్మ దంపతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.