👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
గత కొన్ని సంవత్సరాలుగా గొల్లపెల్లి, వెల్గటూర్, పెగడపెల్లి మండలాలకు చెందిన రైతాంగంకు వరప్రదాయని రంగదాముని పల్లె చెరువు ను నీటి నిలువలు పెంచడం కోసం అభివృద్ధి చేస్తానని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ కుమార్ అన్నారు.
గొల్లపెల్లి మండలం రంగధామునపల్లి చెరువును గురువారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రైతులు, అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
మూడు మండలలా కు చెందిన రైతాంగం ఈ చెరువుపై ఆధారపడి పంటలు సాగు చేసుకుంటున్నారని, ఇక్కడి ప్రాంత రైతాంగానికి సాగు నీటి, తాగు నీటి విషయంలో శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి కలిసి వివరించినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సంబంధిత అధికారులను ఇట్టి విషయం పైన విచారణ జరిపించాలని ఆదేశించినట్టు వివరించారు. ఎమ్మెల్సి జీవన్ రెడ్డి , మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో నియోజకవర్గంలోని ప్రతి చెరువును నీటి నిలువలు పెంచే విధంగా చర్యలు చేపట్టనున్నట్టు ఎమ్మెల్యే రైతులకు వివరించారు. గత ప్రభుత్వంలో నియోజకవర్గాని కి ప్రాతినిధ్యం వహించిన మాజి మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ ప్రాంత ప్రజలకు కనీసం త్రాగడానికి నీటి విషయంలో శాశ్వత పరిష్కారం చూపలేదు అని ఆరోపించారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడి ప్రాంత ప్రజలకు సాగు నీరు, త్రాగు నీరు అందించే విషయంలో తాత్కాలికంగా ఏర్పాట్లు చేయాలని, ఎక్కడ చిన్న ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు వివరించారు. నిధుల విషయంలో కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి నిధులు మంజూరు చేయించుకుంటామన్నారు.
ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వెంట వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి, పెగడపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాములు గౌడ్, వెల్గటూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు