రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ ప్రభంజనం!

J.SURENDER KUMAR,

ధర్మపురి నియోజకవర్గంలోని సర్పంచ్ లు విజయవంతంగా ఐదేళ్ల పదవి బాధ్యతలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గురువారం ధర్మపురి కేంద్రంలోని ఎస్ హెచ్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని సర్పంచ్ లు మరియు వారి కుటుంబ సభ్యులను సత్కరించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ .

ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ..

బిఆర్ఎస్ ప్రభుత్వం లో ఐదు సంవత్సరాలు గౌరవంగా సర్పంచ్ పదవిని ముగియనున్న సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు.
కెసిఆర్ ప్రభుత్వం ఉన్నంత సేపు వ్యవసాయానికి నీళ్ళు వచ్చినై, కాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో నీళ్లు ఎందుకు రావడం లేదో ప్రజలు గమనిస్తున్నారు
ప్రజల మధ్య మదన పాటు ప్రారంభం అయిందని, వ్యవసాయానికి నీరు, ఎరువులు లేదు, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లో పూర్తిగా విఫలం అవుతుంది..
కొన్ని రోజుల్లో గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగితే నిలదీసే పరిస్థితి ఏర్పడుతుంది. అన్నారు.
రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ ప్రభంజనం ఉంటుంది, రానున్న రోజుల్లో ఏ ఎన్నికలైన 100 శాతం మనమే గెలుస్తాం, రానున్నట్టు వంటి సమయంలో బిఆర్ఎస్ పార్టీ కే ఆదరణ ఉంటుంది కొప్పుల ఈశ్వర్ అన్నారు.