J.SURENDER KUMAR,
రాష్ట్రంలో మరోసారి భారీ స్థాయిలో ఐఏఎస్ (IAS) అధికారుల బదిలీలు జరిగాయి. 26 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ Go .RT.,03 . ద్వారా బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాహుల్ బొజ్జాను సాగు నీటి శాఖ కార్యదర్శిగా నియామకం చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు ఇచ్చారు. పురావస్తు శాఖ డైరెక్టర్‌గా భారతి హొళికేరి, ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా స్మితా సభర్వాల్, బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా బుర్రా వెంకటేశం, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్ దత్ ఎక్కా బదిలీపై వెళ్లారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా కె.శశాంకను నియమించారు.
ఐఏఎస్ అధికారుల బదిలీల వివరాలు :
👉 సాగునీటిశాఖ కార్యదర్శి – రాహుల్ బొజ్జా నియామకం
👉 ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శి – స్మితా సభర్వాల్
👉 పురావస్తు శాఖ డైరెక్టర్ – భారతి హొళికేరి
👉 బీసీ సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి – బుర్రా వెంకటేశం
👉 గనులశాఖ ముఖ్యకార్యదర్శి – మహేశ్ దత్ ఎక్కా
👉 ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శి – అహ్మద్ నజీద్
👉 జీఏడీ కార్యదర్శి – ఎం.రఘునందన్‌రావు
👉 ఆయుష్ డైరెక్టర్ – ఎం.ప్రశాంతి
👉 రంగారెడ్డి కలెక్టర్ – కె.శశాంక
👉 నల్గొండ కలెక్టర్ – హరిచందన
👉 జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ – బి.ఎం.సంతోష్
👉 మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ – అద్వైత్ కుమార్ సింగ్
👉 సంగారెడ్డి జిల్లా కలెక్టర్ – వల్లూరు క్రాంతి
👉 పాడిపరిశ్రమ అభివృద్ధి సమాఖ్య డైరెక్టర్ – చిట్టెం లక్ష్మి
👉 పంచాయతీ రాజ్, ఆర్‌డీ కార్యదర్శి – సందీప్ సుల్తానియా
👉 ఫైనాన్స్, ఫ్లానింగ్ ప్రత్యేక కార్యదర్శి – కృష్ణభాస్కర్
👉 పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య డైరెక్టర్ – చిట్టెం లక్ష్మి
👉 కార్మిక శాఖ కార్యదర్శి – కృష్ణ ఆదిత్య
👉 పీసీబీ సభ్య కార్యదర్శి – బుద్ధ ప్రకాశ్
👉 మైనార్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శి – ఎ.ఎం. ఖానమ్
👉 టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ – ఆర్.వి. కర్ణన్
👉 సీఎంవో జాయింట్ సెక్రటరీ – సంగీత సత్యనారాయణ