👉 కంప్యూటర్ ఆపరేటర్లు సమస్య పై విన్నపం
J.SURENDER KUMAR,
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ శనివారం రాత్రి హైదరాబాద్ లో ఆయన ను కలసి రెవెన్యూ శాఖలో తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ల సమస్య పరిష్కరించాలని కోరారు.
రెవెన్యూశాఖ లో దాదాపు 700 మంది కంప్యూటర్ ఆపరేటర్లు విధులు నిర్వహిస్తున్నారని, అందులో 302 వారికి మాత్రమే బడ్జెట్ మరియు మంజూరు ఉత్తర్వులు ఉన్నాయని, మిగితా వారు కూడా గత 5 నుండి 15 సం. ల పని చేస్తున్న వారికి గత 31 నెలల నుండి జీతాలు లేవు అని, మంత్రికి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వివరించారు. వారికి పెండింగ్ లో ఉన్న జీతాలు విడుదల చేసి ఉద్యోగ భద్రత టైపిస్టు కం కంప్యూటర్ ఆపరేటర్ మంజూరు ఉత్తర్వులు ఇప్పించాలని కోరారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ అంశంపై ప్రిన్సిపల్ సెక్రెటరీ ద్వారా వివరాలు తెలుసుకుని నిబంధనల మేరకు త్వరగా సమస్య పరిష్కరించాలని ఆదేశిస్తానంటూ ఎమ్మెల్యేకు, కంప్యూటర్ ఆపరేటర్ల సంఘం నాయకులకు మంత్రి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వెంట కంప్యూటర్ ఆపరేటర్ల సంఘం నాయకులు మచ్చ భూమేష్, ఇరుకుల రాజేందర్, జగిత్యాల జిల్లా, రాపర్తి సునీల్, వశిం, కోమరంభీం అసిఫాబాద్ జిల్లా, మధు – నల్గొండ జిల్లా, రాజేష్ – పెద్దపల్లి జిల్లా, ఆనంద్ – రాజన్న సిరిసిల్ల జిల్లా, శేఖర్ – నాగర్ కర్నూల్ జిల్లా, ప్రవీణ్ – మంచిర్యాల జిల్లా తదితర నాయకులు ఉన్నారు.