శబరిమల ఆలయం నేడు మూసి వేయబడింది !

👉ఫిబ్రవరి 13న నెలవారీ పూజ కోసం తెరుస్తారు!

J.SURENDER KUMAR,

శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయం ఆదివారం ఉదయం పూజ అనంతరం మూసివేశారు.  పందళం రాజ భవనం కు చెందిన  ప్రతినిధి అయ్యప్ప స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజ అనంతరం ఆలయాన్ని మూసివేశారు. ఆదివారం ఉదయం 5 గంటలకు ఆలయాన్ని తెరిచి తంత్రి కందరరావు మహేశ్ మోహనరావు ఆధ్వర్యంలో మహా గణపతి హోమం నిర్వహించారు.

ఆచారం ప్రకారం, పగటిపూట ఆలయంలో ప్రార్థనలు చేయడానికి ఇతరులకు అనుమతి లేదు.  మేల్శాంతి మూల విరాట్ అయ్యప్ప స్వామి  విగ్రహాన్ని పవిత్రమైన భస్మం తో  కప్పిన తర్వాత గర్భగుడిని మూసివేసి, వందల రాజవంశ ప్రతినిధికి ఆలయ తాళాలు  అందజేశారు,  ప్యాలెస్ ప్రతినిధి తిరువాభరణం (పవిత్ర ఆభరణాలు) తీసుకుని ఊరేగింపును తిరిగి పందళం ప్యాలెస్‌కు తీసుకెళ్లారు. పవిత్ర ఆభరణాలు,పరివారం జనవరి 24న ప్యాలెస్‌కి చేరుకోనుంది. తిరిగి అయ్యప్ప స్వామి ఆలయం  ఫిబ్రవరి 13 సాయంత్రం నెలవారీ పూజల కోసం తిరిగి తెరవబడుతుంది. ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డ్ ఫిబ్రవరి 4న తన వర్చువల్ క్యూ బుకింగ్ పోర్టల్‌ను ప్రారంభించనుంది.