సాగునీటి సమస్య పరిష్కరించండి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి!

👉మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతి పత్రం!

J.SURENDER KUMAR,

ధర్మపురి నియోజకవర్గంలోని వెల్గటూర్ మండలం జగదేవపేట, కొండాపూర్, శాఖపూర్ గ్రామాల చెరువులకు శాశ్వత నీటి పరిష్కారానీకి చర్యలు చేపట్టాలని, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంగళవారం హైదరాబాదులో నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీ కలసి పరిస్థితి వివరించి వినతిపత్రం అందించారు.

సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేసి, ఆయ గ్రామాల్లో సుమారు 4400 ఎకరాల పంట పొలాలకు సాగునీటిని అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
నియోజకవర్గంలోని జంగల్ నాలా ప్రాజెక్ట్ లో ప్రస్తుతం నీటి ఇన్ ప్లో 1% ఉందని, ఆవుట్ ప్లో 10% ఉందనీ దీంతో పై గ్రామాలకు సరిపడు నీటి నిల్వలను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, లేదా కాళేశ్వరం, లేదా ఎల్లపల్లి శ్రీ పాద ప్రాజెక్టు ద్వారా ద్వారా పంటపొలాలకు సాగు నీరు అందించి శాశ్వత పరిష్కార చూపాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సాగునీటి సమస్యలను ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వివరించారు.