J. SURENDER KUMAR,
ధర్మపురిలో పట్టణంలో నిర్వహించిన చిరకాల మిత్రుల స్మారక క్రికెట్ టోర్నమెంట్ కప్ విజేతగా దమ్మన్నపేట జట్టు విజేతగా నిలిచింది.
పట్టణంలోనీ కాసెట్టివాడకు చెందిన స్వర్గీయ చెరుకు రాజన్న, వొజ్జల తిరుపతి, శీలం రాజేష్ (పాత్రికేయులు), మరియు న్యాయవాది తిర్మందాస్ సత్యనారాయణ స్మారకార్థం గత వారం రోజుల నుండి నిర్వహించిన స్మారక కప్ టోర్నీలో 24 జట్లు పాల్గొనగా ధర్మపురి 11జట్టు దమ్మన్నపేట జట్టు ఫైనల్ కు చేరాయి.
ఆదివారం హోరా హోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో దమ్మన్నపేట జట్టు విజేతగా నిలిచింది.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ టోర్నమెంట్ లో విజేతగా నిలిచిన జట్టుకు ధర్మపురి పట్టణ మున్నూరు కాపు సంఘ అధ్యక్షులు చీపిరిసెట్టి రాజేష్ ₹ 20 వేల రూపాయల నగదు అందించారు.

దానితో పాటు నిర్వాహకుల అధ్వర్యంలో ట్రోఫీ నీ అందజేసినట్లు, రన్నరప్ గా నిలిచిన జట్టుకు సాక నిశాంత్ (USA) ₹15 వేల రూపాయల నగదు అందించారు. ఈ సందర్భంగా స్మారక క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతీ జట్టుకు ధన్యవాదాలు తెలుపారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సోమ్ సెట్టి రంజిత్ (చిన్ని), మాదాసు. నిఖిల్, గడిపెల్లి భీంరాజ్, డానీ చందు, చల్ల రణధీర్, గడిపెల్లి.హృతిక్ , తదితరులు పాల్గొన్నారు.