శ్రీ లక్ష్మీ నరసింహ స్వామినీ దర్శించుకున్న ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామినీ స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం దర్శించుకున్నారు.


ముందుగా దేవస్థానం సాంప్రదాయం ప్రకారం మేళతాళాలతో స్వాగతం పలికి పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన తదుపరి దేవస్థానం సూపరింటెండెంట్ కిరణ్, శేష వస్త్రం ప్రసాదం అందించి సన్మానించారు.


ఇట్టి కార్యక్రమంలో దేవస్థానం వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ, పాలెపు ప్రవీణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, అర్చకులు సముద్రాల వంశి, అభిషేకం పురోహితులు బొజ్జ సంతోష్ , పాల్గొన్నారు.