👉 ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
స్వాతంత్ర్య సమరయోధులు వడ్డే ఓబన్న జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, భావితరాల వారికి ఆయన పోరాట తీరు తేన్నులు తెలియజేయాలని ధర్మపురి శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
గురువారం వడ్డే ఓబన్న 217 వ జయంతి సందర్భంగా కలెక్టరేట్ లో అయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి ముఖ్య అతిథిగా పాల్గొన్న విప్ మాట్లాడుతూ వడ్డే ఓబన్న జన్మదినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మొట్టమొదటి సారిగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 1807 జనవరి 11 న కర్నూల్ లో జన్మించిన ఆయన పోరాట స్పూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. 10 వేల మందితో సైన్యం ఏర్పాటు చేసుకొని బ్రిటీష్ సైన్యంతో పోరాడిన మహోన్నత వ్యక్తి అని అభివర్ణించారు. ఒడ్డెర కులస్తులకోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. రాష్ట్రంలో నివసిస్తున్న ఒడ్డెర కులస్తుల కష్ట సుఖాలు పరిశీలించి వారి కుటుంబాలకు ప్రభుత్వం నుండి సహకారం అందజేసేందుకు కృషి చేస్తానని అన్నారు.

ఒడ్డెర కుటుంబాల్లోని భార్యాభర్తలు కష్టపడి జీవితం సాగించేవారని అన్నారు. వడ్డెరలను ఎస్టి జాబితాలో చేర్పించడానికి ముఖ్యమంత్రి దృష్టికి తిసుకువస్తానని తెలిపారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ఆరుగ్యారంటీల పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. జిల్లాలోని ఒడ్డెర కులస్తులకు సహకారం అందిస్తామని తెలిపారు. పేదల సంక్షేమం, జిల్లా సమగ్రాభివృద్ధికి కలసికట్టుగా కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత,
జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ,అదనపు కలెక్టర్ బి.ఎస్ లత
ఒడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొగిలయ్య మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో బి.సి. సంక్షేమ అధికారి సాయిబాబా, మున్సిపల్ ఇంచార్జీ చైర్మన్ గోలి శ్రీనివాస్, సీనియర్ సిటిజన్ అధ్యక్షులు హరి అశోక్ కుమార్, బి.సి., ఒడ్డెర కుల సంఘాల నాయకులు, కలెక్టరేట్ లోని వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.