👉 అధికారులు ప్రత్యామ్నాయల పై దృష్టి పెట్టాలి !
👉 నియోజక వర్గ ప్రజలకు తాగు,సాగు నీరు విషయంలో ఇబ్బందులు రావద్దు !
👉 సమీక్ష సమావేశంలో
👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్
J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజక వర్గ ప్రజలకు తాగు, సాగు నీరు అందించే విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, దానికి ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందిస్తామని, ప్రజలకు తాగు నీరు అందించే విషయంలో కేవలం 'డబ్బా' నీటి పైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయల పైన కూడా దృష్టి పెట్టాలని, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
ధర్మపురి ఎంపీడీవో కార్యాలయంలో పలు శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.

వరదలకు చెడిపోయిన లిఫ్టులను త్వరిత గతిన మరమ్మత్తులు చేసి రైతులకు సాగు నీరు అందించాలని, అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబందించిన ఫలాలు అర్హులైన ప్రతి పేదవారికి చేరాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు తగు సూచికలు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.
ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, మండల నాయకులు పాల్గొన్నారు.
దమ్మన్నపేటలో..

ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, మంగళవారం ధర్మపురి మండలం ధమ్మన్నపేట గ్రామంలోని శ్రీ వీర బద్రేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల రాజేష్, ఎంపిటిసి గంగాధర్, రంగు అశోక్, రవి తదితరులు పాల్గొన్నారు

క్యాలెండర్ ఆవిష్కరణ!

ధర్మపురి మున్సిపల్ 11 వార్డ్ కౌన్సిలర్ జక్కు పద్మ రవీందర్ ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంఘన బట్ల దినేష్, కౌన్సిలర్ సంగనబట్ల సంతోషి దినేష్, మండల ఉపాధ్యక్షులు వేముల రాజేష్, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు చిలుముల లక్ష్మణ్, ఆశేట్టి శ్రీనివాస్, స్తంబంకాడి గణేష్ తదితరులు పాల్గొన్నారు
ప్రజాపాలన కార్యక్రమంలో..

ధర్మపురి మండలం కమలాపూర్ గ్రామంలో మంగళవారం జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిధి పెంపు వంటి హామీలను అమలు చేయడం జరిగిందని, రాష్ట్రం ఎంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం జరుగుతుందని, ప్రజలకు నేరుగా సంక్షేమ ఫలాలు అందించే విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని, తననీ ఒక ఎమ్మెల్యే గా బావించవద్దని, ఒక సేవకుడిగానే భావించాలని, దరఖాస్తులు ఇవ్వడానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని, ధరఖాస్తు చేసుకునే వారు సంబంధిత పత్రాలను అధికారులకు సమర్పించాలని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంఘనపట్ల దినేష్, జెడ్పీటీసీ బత్తిని అరుణ, వైస్ ఎంపీపీ మహిపాల్ రెడీ, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు చిలుముల లక్ష్మణ్, సతీష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు
పాఠశాల సమస్యలు తీరుస్తా … పిల్లల సంఖ్యను పెంచండి

కమలపూర్ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించిన శాసన సభ్యులు అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ కు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాఠశాల సమస్యలపై అప్లికేషన్ ఇచ్చారు. సమస్యలను తప్పకుండా పరిష్కారం చేస్తానని, పిల్లల సంఖ్యను పెంచడానికి కృషి చేయమని సూచించారు

నామాపూర్ లో…

పెగడపల్లి మండలం నామపూర్ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు.*. పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, దరఖాస్తులు ఇవ్వడానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, ధరఖాస్తు చేసుకునే వారు సంబంధిత పత్రాలను అధికారులకు సమర్పించాలని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాములు గౌడ్, ఒరిగల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్, ఎంపిటిసి రజిత, సర్పంచ్ కర్ణకర్ రెడ్డి, ఎంపీపీ శోభ సురేందర్ రెడ్డి, పవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్ లో…

ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు. పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, దరఖాస్తులు ఇవ్వడానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తుందని, నన్ను ఒక ఎమ్మెల్యేగా బావించవద్దనీ, ఒక సేవకుడిగానే భావించాలని, ఎవ్వరికీ ఎటువంటి సమస్య ఉన్న నేరుగా నన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకోవచ్చనీ ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో గ్రామ సర్పంచ్ కాళ్ల శేఖర్, ఎంపీటీసీ కాళ్ల సత్తయ్య. వార్డు సభ్యులు, లిఫ్ట్ నిర్వహణ సంఘ అధ్యక్షుడు ప్రకాష్, మరియు జగదీష్, హరీష్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.