👉ఈ.ఓ ధర్మారెడ్డి..
J.SURENDER KUMAR,
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు తిరుమలలోని ఆస్థాన మండపంలో టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సనాతన హిందూ ధార్మిక సదస్సుకు భారీ ఏర్పాట్లను ఏర్పాట్లు పూర్తి చేయాలని ఇఓ ఎవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.
తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో మంగళవారం సంబంధిత అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ మతాచార్యులు, వివిధ మఠాల పీఠాధిపతులు, స్వామీజీలు , దేశవ్యాప్తంగా ఉన్న సంస్థలు ధార్మిక కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
సదస్సుకు వచ్చే స్వామీజీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సదస్సును విజయవంతం చేసేందుకు ముగ్గురు సీనియర్ అధికారులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతి స్వామీజీకి ఒ లైజన్ అధికారిని నియమించాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. లైజన్ అధికారి వసతి, ఆహారం, రవాణా మొదలైన వివిధ కమిటీలతో సమన్వయం చేస్తారు. సదస్సులో పాల్గొనే పీఠాధిపతులు అందించే సూచనలు, సలహాలు,సందేశాలను సవివరంగా వీడియో రూపొందిస్తూ ఎస్వీబీసీ రికార్డు చేయనున్నదని తెలిపారు.
జేఈఓలు శ్రీమతి. సదా భార్గవి, వీరబ్రహ్మం, వేద విశ్వవిద్యాలయం VC ఆచార్య రాణి సదాశివమూర్తి, HDPP కార్యదర్శి సోమయాజులు, ప్రోగ్రాం ఆఫీసర్ . రాజగోపాల్, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఈ సమావేశంలో ఆనంద తీర్థాచార్యులు తదితరులు పాల్గొన్నారు.