త్వరలోనే దేవాదాయ కమిటీల రద్దు – మంత్రి కొండ సురేఖ !


J.SURENDER KUMAR.

రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న అన్ని దేవాలయాల కమిటీలను రద్దు చేయనున్నట్టుగా మంత్రి కొండ సురేఖ అన్నారు

ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు గురువారం మంత్రి కొండ సురేఖను కలిసి దేవాదాయ కమిటీల రద్దు, ఏళ్ల తరబడి ఒకే చోట పని చేస్తున్న ఈవోల గురించి వివరించడం జరిగింది.
త్వరలోనే కమిటీల రద్దుతో పాటు ఈవోలకు స్థానచలనం ఉంటుందని మంత్రి సురేఖ ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. ఎవరైతే పార్టీ కోసం నిరంతరం కష్టపడి పని చేశారో వారికి కాంగ్రెస్ పార్టీ ఉన్నతమైన పదవులను ఇచ్చి గౌరవిస్తుందన్నారు.
దేవాదాయ కమిటీల రద్దు ఏండ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్న ఈవోల స్థానచలనం చేస్తానని మంత్రి కొండ సురేఖ పేర్కొనడం పట్ల పరమేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.