వేద మహాసభ నిర్వహణ ఖర్చు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ దే!

J.SURENDER KUMAR,

లోక కళ్యాణం కోసం గత వారం రోజులుగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఘనంగా జరిగిన 'శ్రీ ప్రేమిక వరద వేద పరిపాలన సభ' నిర్వహణ ఆర్థిక భారం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ భరించారు.

వేద పారాయణం నిర్వహించు వేద పండితుల కు వారి శిష్య బృందం కు వారం రోజులపాటు భోజన ఫలహారాలు, మహా పూర్ణాహుతి సందర్భంగా పండితులకు, పండిత దంపతులకు వస్త్రాలు, ఖరీదైన శాలువాల తో సన్మానం, వారికి తనకు తోచిన సంభావనలను ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వారికి సమర్పించుకున్నారు. మహా పూర్ణాహుతి కార్యక్రమం సందర్భంగా బుధవారం శివాలయంలో బ్రాహ్మణ సుహాసిని భోజనం, స్థానిక బ్రాహ్మణ సంఘ భవనంలో దాదాపు 1500 మంది భక్తులకు అన్నదాన. ఖర్చులు ఎమ్మెల్యే భరించారు.


స్థానిక దైవం శ్రీ లక్ష్మీనరసింహ ఆశీస్సులు, నియోజకవర్గ ప్రజల అభిమానంతో ఎమ్మెల్యేగా విజయం సాధించిన నేను, నా శాసన సభ్యుడి మొదటి నెల జీతం ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కోసం వ్యయం చేస్తానని. స్థానిక దైవమును మొక్కుకున్నట్టు ఎమ్మెల్యే అన్నారు.


వేములవాడ ఆలయ పక్షాన ₹ 2 లక్షలు!

వేద మహాసభ నిర్వహణకై వేద పండితులకు వేములవాడ దేవస్థానం పక్షాన ₹ రెండు లక్షల రూపాయల ప్రొసీడింగ్స్ దేవదాయశాఖ మంత్రి కొండ సురేఖ, కేదారి ఘనపాటి కి అందించారు.
కొండగట్టు, యాదాద్రి ఆలయాల నుండి రావలసిన ఆర్థిక పరమైన అంశం ప్రక్రియలో ఉందని త్వరలో ఆ ప్రొసీడింగ్స్ అందజేస్తానని మంత్రి వేద పండితులకు హామీ ఇచ్చారు.


స్థానిక శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానం పక్షాన కేవలం వసతి, వేద మహాసభ, నిర్వహించుకోవడానికి ఆలయ ప్రాంగణం అప్పగించారు. స్థానిక శివాలయంలో సాంప్రదాయ దుస్తులు ధరించిన వారికి, భక్తులకు బ్రాహ్మణ సంఘ భవనంలో సాయంత్రం వరకు అన్నదానం కొనసాగింది.