👉శ్రీ ప్రేమిక వరద వేద పరిపాలన సభలో వేద పండితులు వేద మంత్రోచ్ఛారణ తో..
👉 మూడవ రోజు యజుర్వేద క్రమ..
J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి . వేదమంత్రాల ఘోషల తో ప్రతిధ్వనిస్తుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం గురువారం నుండి ప్రారంభమై వారం రోజులపాటు జరగనున్న శ్రీ ప్రేమికవరద వేదపరిపాలన సభ లో శనివారంసాయంత్రం వేద పండితులు ఘనపాటీలు, క్రమపాటీలు . సంపూర్ణ ఋగ్వేద హవనము, సంపూర్ణ సామవేద పారాయణ, కార్యక్రమాన్ని నిర్వహించారు.

వేదికపై ఆసీనులై ప్రముఖ వేద పండితులు గంగాధర కేదార్ నాథ్ శర్మ ఘనపాఠీ, అంబటి పూడి వేంకట సుబ్రహ్మణ్య శర్మ ఘనపాఠీ, మారేపల్లి చైతన్య కృష్ణ శర్మ, దహగాం అరుణ్ కుమార్ శర్మ, సుర్య నారాయణ శర్మ ,ఘపపాఠీ, జూనూతుల త్రివేది శర్మ, ఘపపాఠీ
నెమ్మాని ప్రకాష శర్మ ఘణపాఠీ, తూకుట్ల సత్యం నారాయణ ఘనపాఠీ, వారి శిష్య బృందం ఉచ్చరించిన యజుర్వేద క్రమ, ఘన పనసల వేద మంత్రాల ఘోష తో భక్తజనం మంత్రముగ్ధులయ్యారు.

మంగళగిరి, వేదాద్రి, సింహచలం తదితర నారసింహ క్షేత్రములలో నిర్వహించిన తరహాలో 21 మంది వేదపండితులచే ‘సంపూర్ణ కృష్ణయజుర్వేద క్రమపారాయణం’ , ‘సంపూర్ణ ఋగ్వేదహవనము’, ‘సంపూర్ణ సామవేదపారాయణం ‘ (ప్రతి రోజు ఉదయం, సాయంత్రం) కొనసాగుతుంది. ఈనెల 24 న “మహాపూర్ణాహుతి” కార్యక్రమముతో వేద సభ ముగుస్తుంది. శనివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వేద పరిపాలన సభ కు వచ్చి దర్శించుకున్నారు ఈ సందర్భంగా వేద పండితులు, ఆలయ వేద పండితుడు బొజ్జ రమేష్ శర్మ, పండితులుఆశీర్వదించి ప్రసాదం అందించారు.