వేదమంత్రాలు ఘోషల తో పూర్ణాహుతి కార్యక్రమం !

👉 వర్షపు జల్లులు కురిసిన వేళ…

👉హాజరైన మంత్రులు శ్రీధర్ బాబు సురేఖ..

J.SURENDER KUMAR,

లోక కళ్యాణార్థం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం వేదమంత్రాల ఘోషతో పూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా జరిగింది. పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం వర్షపు జల్లులు పడడంతో వేద పండితులు హర్షం చేశారు మంత్రులు పాల్గొన్నారు.

గత వారం రోజులుగా జరుగుతున్న ‘శ్రీ ప్రేమిక వరద వేద పరిపాలన సభ’ లో సంపూర్ణ ఋగ్వేద హావనము, సంపూర్ణ సామవేద పారాయణము, సంపూర్ణ కృష్ణ యజుర్వేద క్రమ పారాయణమును వేద పండితులు నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం ఋగ్వేద హావనము – మహా పూర్ణాహుతి, కార్యక్రమం జరిగింది.


ధర్మపురి శ్రీ మఠం పీఠాధిపతి, శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి వారి అనుగ్రహ సంభాషణ, వేదమంత్రాల పఠనం పూర్ణాతికి మందు వేద పండితుల నిర్వహించారు. స్థానిక బ్రాహ్మణ సంఘం సభ్యులు, వేద పండితులు సాంప్రదాయ దుస్తులు ధరించి హోమశాలలో వేదమంత్రాలతో హోరెత్తించారు. ప్రముఖ వేద పండితులు గంగాధర కేదార్ నాథ్ శర్మ ఘనపాఠీ, అంబటి పూడి వేంకట సుబ్రహ్మణ్య శర్మ ఘనపాఠీ, మారేపల్లి చైతన్య కృష్ణ శర్మ, దహగాం అరుణ్ కుమార్ శర్మ, సుర్య నారాయణ శర్మ ,ఘపపాఠీ, జూనూతుల త్రివేది శర్మ, ఘపపాఠీ
నెమ్మాని ప్రకాష శర్మ ఘణపాఠీ, తూకుట్ల సత్యం నారాయణ ఘనపాఠీ, వారి శిష్య బృందం ఉచ్చరించిన యజుర్వేద క్రమ, ఘన పనసల వేద మంత్రాల ఘోష తో భక్తజనం మంత్ర ముగ్ధులయ్యారు.


మంగళగిరి, వేదాద్రి, సింహచలం తదితర నారసింహ క్షేత్రములలో నిర్వహించిన తరహాలో 21 మంది వేదపండితులచే ‘సంపూర్ణ కృష్ణయజుర్వేద క్రమపారాయణం’ , ‘సంపూర్ణ ఋగ్వేదహవనము’, ‘సంపూర్ణ సామవేదపారాయణం ‘ (ప్రతి రోజు ఉదయం, సాయంత్రం) కొనసాగి బుధవారం “మహాపూర్ణాహుతి” కార్యక్రమముతో వేద సభ ముగిసింది. మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, మాతృమూర్తి జయమ్మ, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ సంగీ సత్యమ్మ , ఆలయ వేద పండితుల రమేష్ శర్మ, కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, స్థానిక వేద పండితులు, స్థానికులు మహా పూర్ణాతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

హిందూ ముస్లిం భాయి భాయి !

మహా పూర్ణతి కార్యక్రమాన్ని కనులారా తిలకించడానికి భారీ సంఖ్యలో భక్తజనం ఆలయానికి తరలివచ్చారు. వారితో పాటు ఇద్దరు ముస్లిం సోదరులు సైతం పాల్గొన్నారు.

శ్రీ మఠం పీఠాధిపతి కి ఆలయ పక్షాన ఘన స్వాగతం!


మహా పూర్ణాహుతి కార్యక్రమానికి విచ్చేసిన ధర్మపురి పీఠాధిపతి శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి వారిని స్థానిక ఇసుక స్తంభం నుంచి మంగళ వాయిద్యాలతో వేదమంత్రాలతో వేద పండితులు స్వాగతించారు.

అనంతరం స్వామివారి శేష వస్త్రాన్ని బహుకరించి పలువురు భక్తులు ఆలయ సిబ్బంది స్వామివారికి పాదాభివందనాలు చేశారు.