👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
విద్యావంతులైన యువత స్వయం ఉపాధి అంశంలో వివిధ మార్గాల అన్వేషణ. అభినందనీయమని, ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు.
మండల కేంద్రం. బుగ్గారంలో సోమవారం నూతనంగా ఏర్పాటు చేసిన కల్యాణి అకాడమిక్ హైట్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ నిర్వాహకులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగనభట్ల దినేష్, బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుభాష్, ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల రాజేష్, బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నర్సగౌడ్, అంజిత్,.చారి తదితరులు పాల్గొన్నారు

పరామర్శ !
జగిత్యాల పట్టణముకు చెందిన శ్యాంసుందర్ రెడ్డి సతీమణి సుజాత సోమవారం పోలాస గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్,. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కుటుంబానికి పరామర్శించి సానుభూతి తెలిపారు