విద్యార్థిని చదువుకు విద్యావేత్తల ఆర్థిక సాయం !

J. SURENDER KUMAR,

ఆర్థిక ఇబ్బందుల తో ఉన్నతవిద్య ను అభ్యసించలేని విద్యార్థినికి విద్యావేత్తలు చేయూతనిచ్చి వేలాది రూపాయల ఫీజు చెల్లించి చదవడానికి ప్రోత్సాహాన్ని అందించారు.

వివరాలు ఇలా ఉన్నాయి.
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూర్ గ్రామానికి చెందిన విద్యార్థిని మంత్రి అంజలికి శాతవాహన విశ్వవిద్యాలయంలో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సీట్ వచ్చింది.
ప్రతి సంవత్సరం ₹40 వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉండగా ఆర్థిక ఇబ్బందులతో ఫీజు కట్టలేని స్థితిలో ఆమె పీజీ లో జాయిన్ కాలేదు.. విషయం తెలిసి ధర్మపురికి చెందిన ‘ WHY Team ‘ మరియు ఇతర దాతల సహకారంతో ₹40 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించి విద్యార్థి నికి చేయూతనిచ్చారు. ఈ కార్యక్రమంలో వై టీమ్ కన్వీనర్ డా. గొల్లపెల్లి గణేశ్, సభ్యులు పెండ్యాల సంజీవ్, జన్మంచి వంశీకృష్ణ, దోనుర్ పాఠశాల ఉపాధ్యాయురాలు ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని అంజలి, పలువురు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.