J.SURENDER KUMAR,
ఏప్రిల్ మాసంలో నిర్వహించే వొంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలకు సన్నద్ధం కావాలని టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం టీటీడీ పరిపాలనా భవనంలోని వివిధ హెచ్ఓడీలతో ఆయన ఛాంబర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. బారికేడ్లు, క్యూ లైన్లు, రూట్ మ్యాప్, గ్యాలరీలు, అన్నప్రసాద వితరణకు ప్రత్యేక సర్వీస్ రూట్, నీరు, విద్యుత్ దీపాల ఏర్పాటుకు అవసరమైన సన్నాహక పనులు ప్రారంభించాలని, కల్యాణానికి ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఇంజనీరింగ్ అధికారులు సిద్ధం చేయాలని ఆదేశించారు. పరిశుభ్రత నిర్వహణ, తలంబ్రాలు తయారీ, సమన్వయంతో కూడిన భద్రతా ఏర్పాట్లు తదితరాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు.అలాగే వొంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయంలోని ఆగమ సలహాదారులు, ధార్మిక సిబ్బంది సలహాలు తీసుకుని ప్రతిరోజు ఉత్సవాల వివరాలతో కూడిన బ్రహ్మోత్సవం బుక్‌లెట్‌ను సిద్ధం చేయాలని జేఈవో ఆదేశించారు.
చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శేష శైలేంద్ర, చీఫ్ పీఆర్వో డాక్టర్ టి రవి, డివైఇఓలు శివ ప్రసాద్, స్వేటా డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి, డిప్యూటీ సిఎఫ్ శ్రీనివాసులు, క్యాటరింగ్ స్పెషల్ ఆఫీసర్ జిఎల్ఎన్ శాస్త్రి, పబ్లికేషన్స్ స్పెషల్ ఆఫీసర్ రామరాజు, డిఇ ఎలక్ట్రికల్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.