ఆడుదాం ఆంధ్రా లో మట్టిలోని మాణిక్యాలను గుర్తించడమే ఉద్దేశం!

👉ముగింపు వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌. జగన్మోహన్ రెడ్డి !

J.SURENDER KUMAR,

గ్రామ స్థాయి నుంచి ఎవరూ ఎప్పుడూ ఊహించని పద్ధతిలో మట్టిలోని మాణిక్యాలను గుర్తించి, వారిని సానపట్టి, సరైన శిక్షణ ఇవ్వగలిగితే మనం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇంకా ఎక్కువగా మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలను పరిచయం చేయగలుగుతాం అనే ఉద్దేశం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గ్రామ, వార్డుస్ధాయి నుంచి రాష్ట్రంలోని ప్రతి ఇంట్లోనూ ఆరోగ్యం, వ్యాయామం, క్రీడల పట్ల అవగాహన పెంచడం చాలా అవసరం అన్నది ప్రధాన ఉద్దేశం సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

విశాఖపట్నంలో మంగళవారం డాక్టర్‌ వైఎస్సార్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా ఫైనల్స్‌లో గె లుపొందిన విజేతలకు బహుమతులు, నగదు పురస్కారాలు సీఎం అందించారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే.

👉ఇందులో భాగంగానే క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్మాడ్మింటన్‌ ఇటువంటి 5 రకాల క్రీడల్లో గత 47 రోజులుగా గ్రామ స్థాయి నుంచి ప్రోత్సహించే కార్యక్రమం చేస్తున్నాం.

👉ఇందులో దాదాపుగా 25.40 లక్షల మంది క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి పాల్గొన్నారు. 3.30 లక్షల పోటీలు గ్రామ, వార్డు స్థాయిలో జరిగాయి.

👉1.24 లక్షల పోటీలు మండల స్థాయిలో, 7,346 పోటీలు నియోజకవర్గ స్థాయిలోనూ, 1731 పోటీలు జిల్లా స్థాయిలో జరిగితే… 260 మ్యాచ్‌లు రాష్ట్ర స్థాయిలో నిర్వహించాం.

👉ఈరోజు ఫైనల్స్‌ ముగించుకొని మన కోడి రామమూర్తిగారి గడ్డ అయిన ఈ ఉత్తరాంధ్రాలో, విశాఖలో సగర్వంగా ముగింపు సమావేశాలు నిర్వహిస్తున్నాం. దాదాపు 37 కోట్ల కిట్లు గ్రామ స్థాయి నుంచి పోటీ పడుతున్న పిల్లలందరికీ ఇచ్చాం.

👉₹12.21 కోట్ల బహుమతులు ఈరోజు పోటీలో పాలుపంచుకున్న మన పిల్లలందరికీ ఇవ్వడం జరుగుతోంది.

👉ఇంతగా ప్రోత్సహిస్తూ.. మట్టిలో మాణిక్యాలను కనుక్కునే ఈ కార్యక్రమంలో చెన్నై సూపర్‌ కింగ్స్, ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్, వీరితోపాటు మిగతా ఆటలకు సంబంధించిన ప్రో కబడ్డీ, బ్లాక్‌ హాక్స్, వాలీబాల్, ఏపీ ఖోఖో అసోసియేషన్, ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ వారంతా పాల్గొంటూ ట్యాలెంట్‌ కలిగిన 14 మందిని దత్తత తీసుకొని వాళ్లందరికీ మరింత ట్రైనింగ్‌ ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి.

👉క్రికెట్‌ నుంచి ఇద్దరు పిల్లలకు, ఇద్దరు చెల్లెమ్మలకు నలుగురిని గుర్తించాం. కబడ్డీ నుంచి ముగ్గురు మగపిల్లలు, ఒక చెల్లెమ్మను గుర్తించాం. వాలీబాల్‌ నుంచి ఒక తమ్ముడు, ఒక చెల్లెమ్మను, ఖోఖో నుంచి ఒక తమ్ముడు, చెల్లెమ్మను గుర్తించాం.

👉బ్యాడ్మింటన్‌ నుంచి కూడా ఒక తమ్ముడు, చెల్లెమ్మను గుర్తించాం. మొత్తంగా 14 మంది పిల్లలకు టాలెంట్‌ ఉంది. మట్టిలో మాణిక్యాలు వీళ్లు.. వీరికి ఇంకా సరైన ట్రైనింగ్‌ ఇవ్వగలిగితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడే పరిస్థితి ఉంటుందని మరింత ట్రైనింగ్‌ ఇచ్చేలా అడుగులు వేయగలిగాం.

👉ఇందులో పవన్‌ (విజయనగరం), కేవీఎం విష్ణువర్ధిని (ఎన్టీఆర్‌ జిల్లా) చెల్లెమ్మ.. వీళ్లిద్దరినీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ దత్తత తీసుకొని మరింత ట్రైనింగ్‌ ఇచ్చే దిశగా శ్రీకారం చుట్టారు.

👉శివ (అనపర్తికి) తూర్పుగోదావరి జిల్లా, కుమారి గాయత్రి (కడప జిల్లా) చెల్లెమ్మను ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది. వీళ్లలో కూడా ప్రతిభ ఉంది. సానపెడితే జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో ఆడే సామర్ధ్యం ఉంది.

👉అదే విధంగా కబడ్డీకి సంబంధించి సతీష్‌ (తిరుపతి), బాలకృష్ణారెడ్డి (బాపట్ల), సుమన్‌ (తిరుపతి) ఈ ముగ్గురినీ ప్రో కబడ్డీ టీమ్‌ దత్తత తీసుకుంది. సుమన్‌ను, సంధ్య (విశాఖ)ను ఏపీ కబడ్డీ అసోసియేషన్‌ దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది.

👉వాలీబాల్‌ కు సంబంధించి ఎం.సత్యం (శ్రీకాకుళం), చెల్లెమ్మలకు సంబంధించి మౌనిక (బాపట్ల) వీళ్లిద్దరినీ బ్లాక్‌ హాక్స్‌ సంస్థ దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చింది.

👉ఖోఖోకు సంబంధించి కె.రామ్మోహన్‌ (బాపట్ల), హేమావతి (ప్రకాశం)ని ఖోఖోలో తర్ఫీదు ఇచ్చేందుకు ఏపీ ఖోఖో అసోసియేషన్‌ ముందుకొచ్చింది.

👉బ్యాడ్మింటన్‌కు సంబంధించి ఎ.వంశీకృష్ణంరాజు (ఏలూరు), ఎం.ఆకాంక్ష (బాపట్ల) వీళ్లిద్దరినీ ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ దత్తత తీసుకొనేందుకు ముందుకొచ్చింది.

👉ఈ రకంగా వీళ్లందరికీ 14 మందికి రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది. అదే విధంగా పైన పేర్కొన్న సంస్థలు కలిసి ఒక్కటై మన పిల్లలకు తర్ఫీదు ఇచ్చేందుకు అడుగులు ముందుకు పడుతున్నాయి. ఈరోజు మనం చేసిన అడుగు ప్రతి సంవత్సరం జరుగుతుంది. మన పిల్లల్ని ఐడెంటిఫై చేసి మరింత తర్ఫీదు ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేస్తాం.

👉రెండోది సచివాలయ పరిధి నుంచి క్రీడలను ప్రోత్సహిస్తూ, వ్యాయామానికి సంబంధించిన విలువను, ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను మరింతగా ముందుకు తీసుకెళ్తూ ప్రోత్సహించే కార్యక్రమం.

👉వీటివల్ల మరింత ప్రోత్సాహం ఆటలకు జరగాలి. మన పిల్లలకు మరింత మంచి జరగాలని మనసారా కోరుకుంటూ పిల్లలకు బహుమతులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ధన్యవాదాలు అని సీఎం తన ప్రసంగం ముగించారు.