ఆ .. కుక్క దే అదృష్టం అంటే…


J.SURENDER KUMAR,


ఆ స్టార్ హోటల్ లో కాలు పెట్టాలంటే ఖరీదైన కారులో ఆ ప్రాంగణంలోకి వెళ్లాల్సిందే. ఆ హోటల్లో ఫంక్షన్ చేసుకోవాలంటే వారం రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి, అలాంటి ఓ ప్రముఖ హోటల్ లో ఓ  ధనవంతులు పెంపుడు కుక్క పుట్టినరోజు వేడుక  అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు మరో 30 మంది ధనవంతుల కుక్కలు అతిథులుగా పాల్గొనడం ప్రత్యేకత.


వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్  ఇండోర్ పట్టణంలోనీ డైనర్స్​ పార్క్‌లోపెంపుడు కుక్క యజమాని ఆకాంక్ష రాయ్​ తన కుక్క పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. గోల్డెన్ రిట్రీవర్​ బ్రీడ్​కు చెందిన కుక్క కు  వారు హ్యాండ్సమ్అ నే ముద్దు పేరు పెట్టుకున్నారు. మూడు సంవత్సరాల వయసు గల కుక్క పుట్టినరోజున   దాని యజమాని ఉదయాన్నే ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం దానిని  ఇండోర్ లోని ప్రసిద్ధ ఖజ్రానా గణేశ్​ ఆలయానికి తీసుకెళ్లి అర్చన చేయించారు.

హ్యాండ్సమ్ కుక్క పుట్టినరోజు వేడుకలకు వచ్చిన 30 కుక్కలకు డాగ్ మీల్స్ తో పాటు, వాటి యజమానులకు రుచికరమైన విందును  ఏర్పాటు చేశారు.  వేడుకలకు వచ్చిన కుక్కలకు రిటర్న్ గిఫ్ట్స్ పంచి పెట్టారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్​ కేక్​ను హ్యాండ్సమ్​ కుక్కతో కట్​ చేయించారు. ప్రత్యేకంగా కుక్కల కోసం  ఏర్పాటు చేసిన స్పెషల్​ గేమ్స్​, అండ్​ మ్యూజిక్ సెషన్​లో కుక్కలు పాల్గొన్నాయి. వివిధ బర్త్​డే సాంగ్స్​కు సరదాగా అవి స్టెప్పులు వేశాయి.

కుక్క పుట్టినరోజు వేడుకల కోసం, దాని యజమాని  సోషల్ మీడియాలో అకౌంట్​. తెరిచారు.  నగరంలో ఎంతో విలాసవంతమైన హోటల్​లో ఓ కుక్క పుట్టిన రోజు వేడుకలను ఇంత గ్రాండ్​గా జరపడం,  ఈ అంశం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​గా మారింది.