ఆర్థికవేత్త మాంటెక్ సింగ్ అహ్లువాలియా తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ!

J.SURENDER KUMAR,

ప్రముఖ ఆర్థికవేత్త, ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.

సోమవారం డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈ భేటీ జరిగింది.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి కేంద్ర, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, గడిచిన పదేండ్లలో భారీగా పెరిగిన అప్పులు, వాటి ప్రభావం, కాంగ్రెస్ హయాంలో దేశంలో అనుసరించిన ఆర్థిక సంస్కరణలు, వివిధ అంశాలపై ఈ సందర్భంగా వారు చర్చించారు.