J.SURENDER KUMAR,
దేశ సమగ్రత, ఐక్యత కోసం ప్రాణ త్యాగం చేసిన ఘనత ఇందిరా గాంధీ ది. దేశంలో శాంతి నెలకొల్పాలని రాజీవ్ గాంధీ ఎల్ టీ టీ ఈ ఉగ్రవాదులకు బలి అయ్యారు సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీ చరిత్ర అరవింద్ తెలుసుకోవాల్సి ఉందని పట్టభద్రులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.
👉ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ..
👉 అవినీతికి కళ్లెం వేసే విధంగా సమాచార హక్కు చట్టం తీసుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ.
సమాచార హక్కు చట్టానికి సవరణలు చేసి తూట్లు పొడిచింది మోడీ..
👉 నిరుపేదల ఆకలి తీర్చెందుకు ఆహార భద్రత చట్టం తీసుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ.
రెచ్చిపోయో ప్రసంగాలు చేసే బిజెపి నాయకుల గత చరిత్ర ప్రజలు గమనిస్తారు.
👉 అటల్ బిహారీ వాజపేయి ఇందిరా గాంధీ ని అపర కాళీమాత అని కొనియాడారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుర్తు చేశారు.
👉 రెచ్చగొట్టే ప్రసంగాలతో ప్రజలను మభ్య పెట్టడం కాదు.. బిజెపి ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు ఎన్ని అమలు చేశారు.
నిరుద్యోగ యువత ఉపాధి కల్పన కోసం మీరు చేశారో చెప్పాలన్నారు.
👉 ప్రభుత్వ రంగ సంస్థలు బలోపేతం కోసం కాంగ్రెస్ కృషి చేస్తే, మోడీ పాలనలో ప్రభుత్వ రంగంలోని సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారు.. ఇదేనా దేశ అభివృద్ధి..
👉 రాముడి పేరు చెప్పడం కాదు రాముడి ఆలోచన కు అనుగుణంగా పాలన కొనసాగాలి పితృ వాక్య పరిపాలకుడు..రాముడితో మోడీ కి పోలికనా..
👉 దేశ రాజధాని సరిహద్దుల్లో కనీస మద్దతు ధర అమలు చేయాలని రైతులు ధర్నా చేస్తే స్పందించడం లేదు..
👉 నాలుగేళ్లు మరిచి ఎన్నికలు సమీ పిస్తున్నాయని మల్లాపూర్ చక్కర ఫ్యాక్టరీ ఇప్పుడు గుర్తు కు వచ్చిందా అని ప్రశ్నించారు.
👉 ముతబడిన ఫ్యాక్టరీలు పునః ప్రారంభించేందుకు ఎం చేశారు చెశారో చెప్పాలి..
👉 ఇన్ని రోజులు ఫ్యాక్టరీ ని సందర్శించాలని ఎందుకు ఆలోచన లేదు. ఇప్పుడు చక్కర ఫ్యాక్టరీ సందర్శన చేయడం ఏమిటి.. అని నిలదీశారు.
👉 చక్కర ఫ్యాక్టరీ ప్రారంభించింది కాంగ్రెస్ అని మరిచిపోవద్దు.
👉 చరణ్ సింగ్ రైతులను రుణ విముక్తులను చేయడానికి లక్ష మాఫీ చేశారని గుర్తు చేశారు.
బిజెపికి మాత్రం రైతుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ది లేదన్నారు.
👉 వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకం ప్రవేశ పెట్టింది.
👉 బిజెపి పదేళ్ల లో బలహీన వర్గాల కు సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు ఏమిటో చెప్పాలి..
👉 జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచన ఎందుకు లేదు..
👉 బలహీన వర్గాల ప్రతినిధిని అని చెప్పుకుంటున్న మోడీ రిజర్వేషన్ పెంచేందుకు కనీస ప్రయత్నం ఎందుకు చేయలేదు..
👉 రాజ్యాంగాన్ని సవరించి రిజర్వేషన్ ఎందుకు పెంచడం లేదు..
👉 కాంగ్రెస్ పార్టీ కుల గణనతో పాటు రిజర్వేషన్ పెంపు కోసం కృషి చేస్తామన్నారు.
👉 డాక్టర్ అంబేడ్కర్ ఆలోచనకు అనుగుణంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం లేదా అని నిలదీశారు.
👉 మాటల్లో బలహీన వర్గాల సంక్షేమం కాదు..చేతల్లో కావాలి..
👉 చట్టలోని లొసుగులు ఆసరా చేసుకొని బలహీన వర్గాలకు చెందిన సీట్లో ఇతర వర్గాల కొనసాగితే కిషన్ రెడ్డి ఎందుకు నోరు మెదపలేదు..
👉 బలహీన వర్గాల హక్కుల ను కాపాడేందుకు చట్టంలో మార్పులు చేసి, వారి హక్కుల కోసం కాంగ్రెస్ కృషి చేసింది అన్నారు.
👉 మోడీ రు.400 ఉన్న సిలిండర్ 1200 చేశారు.. ఇందుకేనా మీ విజయ సంకల్ప యాత్ర..
👉 మహిళా సంక్షేమానికి కట్టుబదిన పార్టీ కాంగ్రెస్ మాత్రమే.
👉 మహిళలకు సౌకర్యం కల్పించరు..కల్పిస్తే ఓర్వరు..ఇదేనా బిజెపి ఆలోచన విధానం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
👉 ఆడ బిడ్డలకు సిలిండర్ రు.500 అందించబోతున్నం. వచ్చే నెల నుండి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నాం..
👉 ప్రజాస్వామ్యయుతంగా, కుల మతాలకు అతీతంగా పని చేయాలి.బిజెపి అవాకులు చవాకులు పేలితే రావణాసురుడికి పట్టిన గతే పడుతుంది..
👉 నాలుగు దశాబ్దాలుగా ఆలయాల నిర్మాణాలు చేపడుతున్నాం..
జగిత్యాలలో కోదండ రామాలయం, ఎల్లమ్మ ఆలయాలు దగ్గులమ్మా ఆలయం నాలుగు దశాబ్దాలుగా ఎన్నో ఆలయాలు నిర్మించిన. హిందూ మతం పట్ల నాకుంత విశ్వాసం ఎవరికి లేదు..దైవ భక్తి మాటల్లో కాదు నేను ఆచరణలో చేసి చూపిస్తున్నా..
👉 రెండేళ్ల నుండి ఎమ్మెల్సీ కవిత కేసు సీరియల్ నడిచినట్టు నడుస్తుంది. ఈ డీ అధికారులు కవితకు నోటీస్ కు ఇస్తే విచారణ కు హాజరు కావడం లేదు. ఇది బిజెపి బీ ఆర్ ఎస్ మద్య అంతర్గత ఒప్పందానికి నిదర్శనం.ఇకనైనా బిజెపి నాయకులు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హితవు పలికారు.