అసెంబ్లీలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి మొదటి ప్రసంగం..

👉గత ప్రభుత్వం కరీంనగర్ జిల్లా నీటి దోపిడీ తీరును నిలదీసిన వైనం….

👉అసెంబ్లీలో ఆగ్రహం.. ఆవేదన వ్యక్తం చేసిన అడ్లూరి…

J.SURENDER KUMAR,

అసెంబ్లీ సమవేశాల్లో భాగంగా బుధవారం ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం శాసనసభలో సభలో మెదటి సారి ప్రసంగించిన తీరులో ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం కరీంనగర్ జిల్లాలో  తాగు  సాగునీటి దోపిడీ తీరు ను నిలదీసిన  వైనం ఆకట్టుకుంది.

ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాటల్లో....

👉అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులైన హరీష్ రావు, కెటిఆర్ మాట్లాడే ధోరణి నీ తప్పుపట్టారు,

👉గౌరవ చట్టసభలో హరీష్ రావు మాట్లాడుతున్న తీరు ,కేటీఆర్ రన్నింగ్ కామెంట్రీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి  మాటలు మన మాటలకు ఎలా కౌంటర్ ఇవ్వాలి అనే ధోరణి ఉందన్నారు.

👉మంత్రి పొన్నం ప్రభాకర్ ను ‘ఏ  కూర్చో అని సంబోధించిన కేటీఆర్, మళ్లీ పొన్నం ప్రభాకర్ ఉద్యమకారుడు నా సహచరుడు అని మాట్లాడడం ఏమిటి అన్నారు.

👉రాష్ట్ర ముఖ్యమంత్రి నీ, దళిత స్పీకర్ ను , బలహీన వర్గాల మంత్రి పొన్నం ప్రభాకర్ ను, మంత్రులను, ఎమ్మెల్యేలు ఉన్న సభలో వారిని ఉద్దేశించి ఏక వచనంతో మాట్లాడటం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు

👉 కాళేశ్వరం నీటినీ మేడారం, మిడ్ మనేరు ద్వారా సిరిసిల్లకు, సిద్దిపేటకు, గజ్వేల్ కు తీసుకువెళ్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

👉మా నీటిని తీసుకుపోతు ప్రాంతానికి మాత్రం చుక్క నీటినీ ఇవ్వలేదని, ఆగ్రహం వ్యక్తం చేశారు.

👉మేడారం  రిజర్వాయర్ వద్ద నిద్ర చేసిన హరీష్ రావు, మేము, రైతులము ఆందోళన చేస్తే ధర్మపురి నియోజకవర్గానికి రిజర్వాయర్ ఏర్పాటు చేస్తామని, దానికి ‘పత్తిపాక రిజర్వాయర్’ అని పేరు పెడతాం అని హరీష్ రావు చెప్పారన్నారు.

👉అసెంబ్లీ సాక్షిగా 2016-17 లో నాటి ముఖ్యమంత్రి  అసెంబ్లీలో ప్రకటన చేశారన్నారు.

👉మా నియోజకవర్గంలో ₹ 20 వేల కోట్లతో కాళేశ్వరం లింక్ 2 పేరుతో మా ప్రాంతానికి చెందిన సుమారు 17వందల ఎకరాల భూములను, పోలీసులను పెట్టి బలవంతంగా లాకున్నరని ఆవేదన వ్యక్తం చేశారు.

👉రైతాంగం పక్షాన పోరాటం చేస్తే నాపై అక్రమంగా 13 కేసులు పెట్టారు అని పెట్టడమే గాక పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పై కూడా. కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

👉,కరీంనగర్ జిల్లాకు నీటి విషయంలో గత ప్రభుత్వం చేసిన అన్యాయాలపై పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్ బాబు  నాయకత్వంలో శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు.

👉కృష్ణ జలాలపై స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  ప్రకటన చేసిన తర్వాత దానిపైన మాట్లాడే అవసరం లేదన్నారు.

👉రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ఎక్కడ అమలు చేస్తుందేమో అని భయపడి ఈ విధంగా సభను తప్పుదోవ  పట్టించడం జరుగుతుందని,

👉హరీష్ రావు ఏదో కాగితాలు పట్టుకొని అరగంట ఇంగ్లీష్ లో మాట్లాడు, ఆ ఇంగ్లీష్ మాకు రాదా అధ్యక్ష,. వారికి కేటాయించే సమయం  పరిశీలించాలన్నారు.

👉వారు చెప్పే కల్లబొల్లి మాటలు రాష్ట్ర ప్రజలు విని నమ్మే స్థితిలో లేరని లక్ష్మణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.