👉 ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ జయంతి సందర్భంగా..
****
ఆయుధం పట్టుకొని యుద్ధం చేసే వ్యక్తి కన్నా అహింసా మార్గమే ఆయుధంగా ధరించిన వ్యక్తే ప్రమాద కరమైన వ్యక్తి అని బ్రిటీష్ పాలకులతో అనిపించుకున్న గొప్ప ధీరుడు. ‘నేను ఎట్టి పరిస్థితుల్లో అహింసా మార్గాన్ని వీడను. పగ, ప్రతీకారం జోలికి వెళ్లను. నన్ను అణచివేసిన, హింసించిన వ్యక్తులను కూడా క్షమిస్తాను’ అన్న ప్రతిజ్ఞతతో ‘కుదాయ్ కిద్మత్ గర్’ పేరిట భారత స్వాతంత్య్ర పోరాటానికి స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సరిహద్దు గాంధీ గా ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పేరు పొందారు. బాద్షా ఖాన్‌గా కూడా ఆయన ప్రసిద్ది చెందారు. స్వాతంత్య్ర సమరయోధుడు, గాంధేయవాది. భారతరత్న పురస్కారమును పొందిన తొలి భారతీయేతరుడు.
‘ఎర్రచొక్కాల ఉద్యమం’ ప్రారంభించిన ప్రముఖుడు. ఇతని అనుచరులను ‘ఖుదాయీ ఖిద్మత్‌గార్’ (భగవత్సేవకులు) అని పిలిచేవారు. ఇతను పష్తో లేదా పక్తూనిస్తాన్‌కు చెందిన రాజకీయ, ధార్మిక నాయకుడు. అబ్దుల్ గఫర్ ఖాన్ భారతదేశంలో బ్రిటిష్ ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడిన పష్టున్ స్వాతంత్య్ర కార్యకర్త. ‘బచా ఖాన్’ గా ప్రసిద్ధి చెందిన అతను మహాత్మా గాంధీకి చాలా సన్నిహితుడు, మిత్రుడు, అయన భారతదేశంలో సరిహద్దు గాంధీగా, పాకిస్తాన్‌లో బచా ఖాన్ గా సుపరిచితులు.
భారతదేశం విభజన అనంతరం పాకిస్తాన్‌లో స్థిరపడిన గఫార్ ఖాన్.. తన జీవితంలో దాదాపు 42 ఏండ్లు జైలులోని గడిపాడు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ 1890 ఫిబ్రవరి 6 న జన్మించారు. తండ్రి వ్యతిరేకించినప్పటికీ మిషనరీ పాఠశాలలో చదువుకున్నారు. తదుపరి ఉన్నత చదువులను అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ నుంచి పూర్తిచేశారు.

ఇరవై ఏండ్ల వయస్సులో తన స్వస్థలమైన ఉత్మాన్ జైలో గఫార్ ఖాన్ ఒక పాఠశాలను ప్రారంభించగా.. 1915 లో బ్రిటీష్ ప్రభుత్వం నిషేధించింది. తర్వాత మూడేండ్లపాటు అతను పష్టున్లలో అవగాహన కల్పించడానికి వందలాది గ్రామాల్లో పర్యటించారు. బ్రిటిష్ వారి నుండి ఇండియా, పాకిస్థాన్ స్వాతంత్య్రం పొందిన తరువాత కూడా ఆయన చాలా కాలం పాటు గృహనిర్బంధంలో వున్నారు. ఆ సమయంలో గఫార్ ఖాన్ తీవ్రమైన పక్షవాతంతో బాధ పడ్డారు. అతన్ని చికిత్స కోసం భారతదేశానికి తరలించారు మరియు భారతదేశంలోని వైద్య సిబ్బంది అతనికి చికిత్స చేయలేమని ప్రకటించారు. తర్వాత ఆయనను పెషావర్‌లోని లేడీ రీడింగ్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు, అక్కడ జనవరి 20, 1988న మరణించారు.
ది ఫ్రాంటియర్ గాంధీ: ది బాద్షా కాన్, ది టార్చ్ ఫర్ పీస్’ అనే పేరుతో రచయిత, చిత్రనిర్మాత టి.సి. మెక్లూహాన్ ఆయన జీవితంపై సినిమా తీశారు. ఆ సినిమా 2008లో విడుదలైంది అదే విధంగా 2009 మిడిల్ ఈస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో “ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా బహుమతిని గెలుచుకుంది. “ది మెజెస్టిక్ మ్యాన్,” ఆంగ్లంలో ఒక చిన్న జీవిత చరిత్ర డాక్యుమెంటరీని 1989 సంవత్సరంలో అబ్దుల్ కబీర్ సిద్ధిఖీ రూపొందించారు. నటుడు దిల్షేర్ సింగ్ రిచర్డ్ అటెన్‌బరో యొక్క ఇతిహాసం 1982 చిత్రం “గాంధీ”లో నటించారు. అతని గౌరవార్థం న్యూఢిల్లీలోని కరోల్ బాగ్‌లోని గఫార్ మార్కెట్ అని పేరు పెట్టారు.
వ్యాసకర్త !
యం.రాం ప్రదీప్ తిరువూరు
మొబైల్ ;9492712836