కారు ప్రమాదంలో ‘అడ్లూరి’కి ఆసరా ఇచ్చిన కాషాయదారి !

J.SURENDER KUMAR,

ధర్మపురి ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడి అందులో ఇరుక్కున్న ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కు ధైర్యం చెప్పుతూ కారు నుంచి బయటకు. ఓ కాషాయదారి  రప్పించాడు.

కాషాయ దారి


సోమవారం తెల్లవారు జామున దాదాపు గంటలు 3. 15 నిమిషాల మధ్యకాలంలో జరిగిన ఈ ప్రమాదంలో లక్ష్మణ్ కుమర్ తో పాటు గన్ మెన్లకు,, డ్రైవర్ కు   గాయాలైన విషయం తెలిసిందే. ప్రమాదం నుంచి బయటపడ్డ గన్ మెన్లు ఆ రాత్రి  వెలగటూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి కి ఫోన్ ద్వారా సమాచారం అందించారు.  శైలేందర్ రెడ్డి గన్ మెన్ కు ఫోన్ లో ధైర్యం చెప్పి హుటాహుటిన తన వాహనంలో నిమిషాల వ్యవధిలో సంఘటన స్థలానికి చేరుకున్నారు.

ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్..

ఈ దశలో ఓ గృహప్రవేశ కార్యక్రమానికి వెళుతున్న కాషాయదారి చిమ్మ చీకటిలో కారు ప్రమాద దృశ్యాలు, రోడ్డుపై గన్ మెన్ ల ను చూసి  వారు ఆగారు. ‘ఎమ్మెల్యే  కారులో చిక్కుకున్నారని ఎలాగైనా రక్షించాలని’ వీరిని గన్ మెన్లు కోరారు. కారులో చిక్కుకున్న ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కు కాషాయదారి ధైర్యం చెబుతూ ‘ మీకు ఏం కాలేదు, నెమ్మదిగా, నెమ్మదిగా  అడుగు బయటకు పెట్టండి, అంటూ బయటికి రప్పించారు. ‘ అరే నాకు ఏం కాలేదు, ఎవరికైనా ఏమన్నా అయిందా ? అంటూ లక్ష్మణ్ కుమార్ గన్మెన్లను అడిగినట్టు తెలిసింది. సార్ మాకేం కాలేదు అంటూ ఎమ్మెల్యేను వారు రోడ్డుపైకి తీసుకొచ్చారు. ఈ దశలో వెల్లటూరు ఎస్సై సంఘటన స్థలానికి చేరుకున్నాడు. 

ఈలోగా గొల్లపల్లి మండలానికి చెందిన ఆల్టో కారు ధర్మారం వైపు వెళ్తుండగా  అందులో ఎస్సై లక్ష్మణ్ కుమార్ ను తీసుకొని ధర్మారం లోని సాయి బాలాజీ ప్రైవేట్ క్లినిక్ కు చేరుకున్నారు. ఈ దశలో శైలేందర్ రెడ్డి ధర్మారం చేరుకుని పోలీసు వాహనంలో లక్ష్మణ్ కుమార్ తో కలిసి కరీంనగర్ లోని అపోలో రీచ్ ఆస్పత్రికి బయలుదేరారు. ముందస్తుగా అపోలో ఆస్పత్రి వైద్యులను కాంగ్రెస్ నాయకుడు శైలేందర్ రెడ్డి, ఎస్సై అప్రమత్తం చేయడంతో అత్యవసర వైద్య పరికరాలతో వైద్యులు గాయపడిన ఎమ్మెల్యే కోసం సిద్ధంగా ఉన్నారు. ఆసుపత్రి కి చేరగానే లక్ష్మణ్ కుమార్ ను వైద్యులు ఐసీయూలోకి తీసుకుని వెళ్లి అత్యవసర వైద్య పరీక్షలు,  సేవలను అందించారు. సమాచారం తెలిసిన వెంటనే తెల్లవారుజామున ధర్మపురికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వేముల రాజేష్, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు కరీంనగర్ కు తరలి వెళ్లారు.


బోల్తా పడిన కారులో చిక్కుకున్న ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కు. ఓ కాషాయదారి, ధైర్యం చెబుతూ నెమ్మదిగా బయటికి రండి, కాలు బయట పెట్టండి. అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

👉ధర్మపురి నుంచి హైదరాబాద్ ..

ఆదివారం ధర్మపురిలో ఎమ్మెల్యే ప్రభుత్వ నివాస గృహ ప్రవేశం చేసిన లక్ష్మణ్ కుమార్ స్థానిక ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొని.  హైదరాబాదులో శుభకార్యాలకు హాజరు కావడానికి సాయంత్రం వెళ్లారు. రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాదులోని మణికొండలో ఓ ఫంక్షన్ లో పాల్గొని దాదాపు రాత్రి 12 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే  ధర్మపురి కి తిరుగు ప్రయాణం అయ్యారు. సోమవారం తెల్లవారు జామున జరిగిన కారు ప్రమాదం తెలిసిందే.