ధర్మపురికి వంద పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నర్సింగ్ కళాశాల !

👉మంత్రి దామోదర రాజనర్సింహ !

J.SURENDER KUMAR,

ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి 100 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్, నర్సింగ్ కాలేజీ మంజూరు, చేయిస్తానని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ధర్మపురి క్షేత్రానికి విచ్చేసిన మంత్రి శుక్రవారం ఉదయం ధర్మపురి శ్రీ లక్ష్మినరసింహ స్వామి వారిని దర్శించుకొని, అభిషేకము, హోమము, స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు., అనంతరం ఆలయ అధికారులు మరియు అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు మరియు శేష వస్త్రన్ని అందించారు.


మంత్రి దామోదర రాజనర్సింహ స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి పాత్రికేయులతో మాట్లాడారు…
ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి 100 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్, నర్సింగ్ కాలేజీ మంజూరు, MCH లో మరియు

కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో వైద్య సిబ్బంది నియామకం, ప్రస్తుత CHC లో శవ పంచనామ జరుపుట వంటి పలు సమస్యలను తన దృష్టికి తీసుకురావడం జరిగిందని వాటన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని, ధర్మపురికి విద్య వైద్యం అందించే విషయంలో ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
మీడియా సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగనబట్ల దినేష్,మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల రాజేష్, సుముక్ జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు చిలుముల లక్ష్మణ్. ధర్మపురి నియోజకవర్గ యువజన అధ్యక్షులు సింహరాజ్ ప్రసాద్. జక్కు రవీందర్. రాజేష్ లక్ష్మణ్ . రవి. సాగర్ నరేందర్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు దితరులు పాల్గొన్నారు