J.SURENDER KUMAR,
గత సోమవారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన
ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లురి లక్ష్మణ్ కుమార్ ను ఐటి పరిశ్రమల, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు పరామర్శించారు.

సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అడ్లురి లక్ష్మణ్ కుమార్ ను గురువారం మంత్రి పరామర్శించారు. కారు ప్రమాదానికి గురి అయిన తీరును లక్ష్మణ్ కుమార్ మంత్రికి వివరించారు. వైద్యులు లక్ష్మణ్ కుమార్ కు అందించిన వైద్య వివరాలను మంత్రికి వివరించారు.

కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, జువ్వడి నర్సింగరావు,

స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి, తీన్మార్ మల్లన్న , కాంగ్రెస్ శ్రేణులు లక్ష్మణ్ కుమార్ ను ఆస్పత్రిలో పరామర్శించారు.

శుక్రవారం ధర్మపురికి రానున్న ఎమ్మెల్యే!
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ ఆశోద ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం పగలు ధర్మపురి కి రానున్నారు.