ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ నివాసంలో గృహప్రవేశం !


J.SURENDER KUMAR,

ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నియోజకవర్గ కేంద్రంలో నిర్మితమై ఉన్న ఎమ్మెల్యే ప్రభుత్వ నివాసంలో ప్రత్యేక పూజల అనంతరం ప్రవేశించారు.


ఆదివారం వేద పండితులు ముందుగా ఎమ్మెల్యే దంపతులతో గోపూజ చేయించారు. ప్రధాన ద్వారం గుండా ఎమ్మెల్యే దంపతులు లోనికి ప్రవేశించారు. మధు గౌతమ్ శర్మ, పాలెపు ప్రవీణ్ శర్మలు, స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు వేదమంత్రాలతో పూజలు చేసే ఎమ్మెల్యే దంపతులను ఆశీర్వదించారు.

స్థానిక మున్సిపల్ కార్పొరేటర్లు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, పోలీసు అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే దంపతులను అభినందించారు.