ధర్మపురి పై చాపర్ చెక్కర్లు !


J. SIRENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి పట్టణ గగన తలంపై చాపర్ విమానం గంట క్రితం నుంచి చెక్కర్లు కొడుతున్నది.


దమ్మన్నపేట, రాజారాం, నేరెళ్ల , జైన, దోనూర్, దొంతపూర్, గ్రామాల ఇండ్ల, పంట పొలాల పై దాదాపు 100 నుంచి 200 మీటర్ల ఎత్తు నుంచి చాపర్ విమానం చెక్కర్లు కొట్టడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏవియేషన్ నుంచి సంబంధాలు తెగిపోయి చెక్కర్లు కొడుతుందా  ? అనే విషయంలో స్పష్టత లేదు. జిల్లా పోలీసు యంత్రాంగం, కలెక్టర్ కార్యాలయం సంప్రదించగా, తమకు ఎలాంటి సమాచారం లేదని ఆయా కార్యాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులు తెలిపారు