గత ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తాం !

👉 సీఎం రేవంత్ రెడ్డి!

J.SURENDER KUMAR,

గత ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తాం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.సీఐఐ ఆధ్వర్యంలో ‘విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక అవకాశాలు’ అంశంపై బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…

స్వర్గీయ ఇందిరాగాంధీ విధానపరమైన నిర్ణయం తీసుకుని ఐడీపీఎల్‌ ను ప్రారంభించినందునే ఫార్మా రంగంలో హైదరాబాద్‌ మెరుగైన స్థితిలో ఉందని అన్నారు.  రాష్ట్రంలో 64 ఐటీఐలను స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లుగా ₹ 2000 కోట్లతో అభివృద్ది చేయబోతున్నట్లు సీఎం వెల్లడించారు. స్కిల్లింగ్ యూనివర్సిటీల  ఏర్పాటు కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికేట్లు ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో డ్రైపోర్ట్‌ ఏర్పాటు చేస్తామని  అన్నారు. గత పాలకుల నిర్ణయాల వల్లే హైదరాబాద్‌ ఐటీ హబ్‌గా మారిందని గుర్తు చేశారు.

గతంలో అవుటర్‌ రింగ్ రోడ్డు అవసరం లేదని కొందరన్నారని, ఇప్పుడది హైదరాబాద్‌కు లైఫ్‌లైన్‌గా మారిందని సీఎం వివరించారు. తెలంగాణలో విద్య ఉపాధి అవకాశాల కల్పనలో సీఐఐతో కలిసి నడుస్తామని సీఎం అన్నారు.