జీవో 317 లోపాల సవరణకు మంత్రివర్గ ఉపసంఘం !

👉మంత్రి దామోదర రాజనరసింహ ఛైర్మన్‌గా సభ్యులుగా మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ !

J.SURENDER KUMAR,

జీవో ఎంఎస్ 317 లో జరిగిన లోపాలను సవరిస్తూ ప్రభుత్వం శనివారం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి దామోదర రాజనరసింహ ఛైర్మన్‌గా సభ్యులుగా మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ లను నియమించింది.

జీవో ఎంఎస్ నెంబర్ 317 తేదీ 6 .12. 2021 ద్వారా కొత్త జిల్లాల ప్రకారం ఉపాధ్యాయుల విభజన జరగగా, జీవో నెం 317తో  ఉపాధ్యాయుల దంపతులకు మరియు స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులకు అన్యాయం జరిగింది. గత ప్రభుత్వంలో జీవో నెంబర్ 317 లోపాలు సవరించాలని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున పలు సందర్భాల్లో ఆందోళన చేసిన గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం  నిరసన ప్రదర్శనల ను ఆందోళనలను, ఉక్కుపాదంతో  అణచివేసింది.


ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థుల మేరకు ఈ లోపాలను సవరిస్తూ జీవో ఎంఎస్ నెం 292 తేదీ 24.2  .2024 ద్వారా మంత్రివర్గం ఉప సంఘం ఏర్పాటు చేశారు. పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు యల్లా అమర్నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోయిని పెల్లి ఆనందరావు వర్షం వ్యక్తం చేశారు మంత్రివర్గ ఉప సంఘం వీలైనంత తొందరలో తన నివేదికను ప్రభుత్వానికి అందజేసి బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.