👉ఇష్టానుసారం ప్రవర్తించిన అధికారులు ఇంటికి పోతారు
👉నాలుగు గంటల పాటు సాగిన సమావేశం
👉ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
J.SURENDER KUMAR,
15 రోజుల్లో హెచ్ంఎండీఏ, జీహెచ్ఎంసీలో విజిలెన్స్ దాడులు జరుగుతాయి. ఇష్టానుసారంగా వ్యవహరించిన అధికారులు ఇంటికిపోతారు. హెచ్ఎండీఏ కార్యాలయంలో వాటర్ వర్క్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జీహెచ్ఎంసీపై శుక్రవారం నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉన్నతాధికారులు దాన కిషోర్, శ్రీమతి ఆమ్రపాలి తదితర అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. సీఎం మాటల్లో…
👍 జీహెచ్ఎంసీ, హెచ్ ఎండీఏ పరిధిలో బిల్డింగ్ పర్మిషన్స్ ఫైల్స్ క్లియర్‌గా ఉండాలి
👉 చాలా బిల్డింగ్స్ అనుమతులకు సంబంధించిన ఫైల్స్ కనిపించడం లేదు. ఆన్‌లైన్ లేకుండా ఇష్టారీతిగా పర్మిషన్లు ఇచ్చారు.
👍 ఆన్‌లైన్‌లో లేకుండా ఇచ్చిన అనుమతుల జాబితా తయారు చేయాల్సిందే..
👉 హెచ్ ఎండీఏ వెబ్‌సైట్ నుంచి చెరువుల ఆన్‌లైన్ డేటా ఎందుకు డిలీట్ అవుతోంది..
👉 3,500 చెరువుల డేటా ఆన్‌లైన్‌లో ఉండాల్సిందే..
👉 చెరువులు ఆక్రమణకు గురికాకుండా వాటి వద్ద తక్షణమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
పురపాలక పరిపాలన శాఖపై సీఎం సమీక్ష:

👉 హైదరాబాద్ నగరంలో పిల్లల కోసం క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలి
👉 కొత్తగా ఏర్పడిన 85 మున్సిపాలిటీల్లో కమిషనర్లు లేకపోవడంపై సీఎం శ్రే వంత్ రెడ్డి ఆశ్చర్యం..
👉ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి
👉 గ్రూప్ 1 అధికారులు కమిషనర్‌లుగా ఉండేలా చూడాలని ఆదేశం…
👉కొత్త కార్పొరేషన్లకు ఐఏఎస్‌లను కమిషనర్‌లుగా నియమించాలని సూచన
👉 మున్సిపాలిటీల్లో పని చేసే మున్సిపల్ వర్కర్లకు ప్రమాద బీమా కల్పించడంపై అధ్యయనం చేయాలని ఆదేశాలు…
👉జీహెచ్ ఎంసీలో వయస్సుపైబడిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచన
👉 ఆస్తి పన్ను మదింపు కోసం డ్రోన్ కెమెరాలను ఉపయోగించేందుకు అధ్యయనం చేయాలని సీఎం ఆదేశాలు
👉 హైదరాబాద్‌లో ప్రైవేట్ సెక్టార్‌లో మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని సీఎం సూచన
👉 జోనల్ కమిషనర్లకు ముఖ్యమంత్రి హెచ్చరిక… ఉదయమే లేచి కాలనీల్లో పర్యటించని జోనల్ కమిషనర్లు ఇంటికి వెళ్లిపోవచ్చన్న ముఖ్యమంత్రి
👉 కుర్చీల్లో కూర్చొనే పోస్టులు కావాలంటే ఇస్తామని వ్యాఖ్య
👉 హైదరాబాద్‌లో న్యూయార్క్ టైమ్ స్క్వేర్ తరహాలో వీడియో ప్రకటనల బోర్డు ఏర్పాటు చేయాలని సూచన
👉 మల్టీ యుటిలిటీ టవర్స్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు
👉వీధి దీపాలు మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని సూచన
వాటర్ వర్క్స్ సమీక్షలో సీఎం..
👉 హైదరాబాద్ నగరానికి మంచి నీటి కొరత లేకుండా చూడాలని ఆదేశాలు
👉 స్థానిక చెరువులను స్టోరేజీ ట్యాంకులుగా ఉపయోగించుకోవాలని సూచన
👉 మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్ నుంచి హైదరాబాద్‌కు తాగు నీటి సరఫరా అయ్యేలా ప్రణాళిక రచించాలని ఆదేశం…
👉ఔటర్ రింగు రోడ్డు బయట ఉన్న చెరువులను క్లస్టర్లుగా విభజించాలని సూచన
👉 వచ్చే 50 ఏళ్ల తాగు నీటి అవసరాల కోసం ప్రణాళికలు రచించాలని అధికారులకు సూచించిన సీఎం
👉 హైదరాబాద్‌లో విలువైన ప్రభుత్వ ఆస్తుల జాబితాను ప్రభుత్వానికి సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశలు జారీ చేశారు.
👉 హైదరాబాద్‌లో ఏవైనా ప్రారంభోత్సవాలు ఉంటే వారం రోజుల్లో పెట్టుకోవాలని అధికారులకు సీఎం సూచన
👉మెట్రో కొత్త మార్గాలకు త్వరలో శంకుస్థాపన తేదీలను ఖరారు చేయాలని అధికారులు ఆదేశించారు.