హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ గా డాక్టర్ వారిజారాణి !

👉ప్రశంసించిన ప్రధాని మోడీ ..

J. SURENDER KUMAR

భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో ప్రొఫెసర్ గా డాక్టర్ వారిజారాణి నియమితులయ్యారు.
సోమవారం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన రోజ్గార్ మేళాలో భారత ప్రభుత్వంలో నియమితులైన వివిధ శాఖలకు చెందిన అభ్యర్థులకు ప్రధాని మోడీ నియమిత పత్రాలు అందజేసారు. ఈ మేళాలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులనుద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు

.

హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం దేశం లోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఎనిమిదవ స్థానం లో ఉంది. ఈ విశ్వ విద్యాలయం అత్యంత ప్రతిష్టాత్మకమైన “ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్సు” గౌరవం పొందింది. ధర్మపురి క్షేత్రానికి చెందిన డాక్టర్ వారిజారాణి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆచార్యులుగా, మహిళా విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ గా విధులు నిర్వర్తించారు. డాక్టర్ వారిజారాణి, ఉస్మానియా నుండి ఎం.ఎ తెలుగు, ఎం.ఎ సంస్కృతం పట్ట పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుండి జర్నలిజంలో మాస్టర్స్ చేసారు.

కేంద్రీయా విశ్వ విద్యాలయం నుండి తులనాత్మక అధ్యయనంలో ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య, పర్యవేక్షణలో డాక్టరేటు పట్టా పొందారు . కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా, మరియు సంగీతంలో డిప్లమా పొందారు. కాకతీయ విశ్వ విద్యాలయం నుండి బి.ఎ లో గోల్డ్ మెడల్ సాధించారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ యంగ్ సైంటిస్ట్ గా ఎంపిక కాబడి రెండు సంవత్సరాల స్కాలర్ షిప్ అందుకున్నారు.


డాక్టర్ వారిజారాణి రాష్ట్రస్థాయి , జాతీయ, అంతర్జాతీయ సదస్సు లలో దాదాపు 50 పత్ర సమర్పణలు చేసారు. నాలుగు పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. ఈమె రచించిన దాదాపు 40 తెలుగు, ఆంగ్ల వ్యాసాలు వివిధ సాహిత్య పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వివిధ విశ్వ విద్యాలయాల్లో, కళాశాలల్లో పాఠ్య ప్రణాళిక సంఘ సభ్యుల గా కొనసాగారు. వివిధ విశ్వ విద్యాలయాల దూరవిద్యా కేంద్రాల స్నాతక స్థాయి పాఠ్యగ్రంథాల్లో అధ్యాయాలు రచించారు.


వారిజారాణి కేంద్ర ప్రభుత్వ సెన్సార్ బోర్డు
సభ్యులుగా రెండు సంవత్సరాలు సేవలు అందించారు. ప్రస్తుతం అమెరికా లోని సిలికాన్ ఆంధ్ర విశ్వ విద్యాలయంలో గెస్ట్ ఫాకల్టీగా సేవలు అందిస్తున్నారు.