జగిత్యాలలో అఖండ హనుమాన్ చాలీసా పారాయణం!


J.SURENDER KUMAR,

అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగిన సందర్భంగా జగిత్యాల పట్టణంలో మంగళవారం నుంచి మూడు రోజులపాటు అఖండ హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభమైంది.

ప్రముఖ ప్రవచకులు డా. బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి శ్రీసీతారాముల శోబాయత్ర, పట్టణంలో అఖండ హనుమాన్ చాలీసా, అహో రాత్ర పారాయణ మాహా యజ్ఞం, సీతారామ కళ్యాణం, శ్రీ రామ పట్టాభిషేకం లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి.

వాసవి గార్డన్స్ లో నేటి నుండి 3 రోజుల పాటు అంగ రంగ వైభవంగా జరపడానికి జగదాలయ ఆథ్యాత్మిక బృందం అధ్వర్యంలో, స్థానిక భక్త మార్కండేయ దేవాలయము నుండి తహసీల్ చౌరస్తా, టవర్ సర్కిల్, న్యూ బస్ స్టాండ్ నుండి శోభాయాత్ర వాసవి గార్డెన్స్ వరకు మహిళలు కోలాటాలతో అలరించారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కోటగిరి శ్రవణ్ కుమార్, చెట్ల చంద్ర శేఖర్, మార కైలాసం, బోనగిరి రామనారాయణ, సామాజిక, కార్యకర్త తవుటు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.