👉 కౌన్సిలర్ హనుమండ్ల.జయశ్రీ !
J.SURENDER KUMAR,
ఈనెల 23న జరగనున్న జగిత్యాల మున్సిపల్ బడ్జెట్ సమావేశం వాయిదా వేయాలని 35 , వార్డు కౌన్సిలర్ అనుమల జయశ్రీ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు.
వినతిపత్రంలో వివరాలిలా ఉన్నాయి..
బడ్జెట్ సమావేశం 23-02-2024 రోజున మధ్యాహ్నం లకు ఏర్పాటు చేశారు. మున్సిపల్ లో ఖాళీ ఉన్న చైర్మన్ పదవి ఎన్నిక కొరకు 24-02-2024 లోగా నోటీస్ లు అందచేసి 28-02-2024 న 11:00 గంటలకు చైర్మన్ ఎన్నిక జరపాలని ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిందని ఆమె వినతిపత్రంలో పేర్కొన్నారు.

ఎలక్షన్ కమీషన్ ఆదేశాలు జారీ చేసినందున ఈ బడ్జెట్ సమావేశాన్ని వాయిదా వేసి చైర్మన్ ఎన్నిక నిర్వహణ తర్వాత నూతన చైర్మన్ ఆధ్వర్యంలో బడ్జెట్ సమావేశం నిర్వహించాలని ఆమె కోరారు. బడ్జెట్ సమావేశం పూర్తి స్థాయిలో చర్చ జరగాలి అంటే సమావేశం 11.00 గంటలకు ఎర్పాటు చేయాలి అప్పుడే పూర్తిస్థాయి లో చర్చ జరిగే అవకాశం కూడ ఉంటుంది. మరియు ” సమ్మక్క సారక్క ” జాతర కూడ జరుగుతున్న దృష్ట్యా కొంత మంది జాతరకు పోయే అవకాశం ఉన్న దృష్ట్యా కొత్త చైర్మన్ ఎన్నిక ప్రక్రియ అనంతరం బడ్జెట్ సమావేశం నిర్వహించాలని కమిషనర్ కు ఆదేశాలు జారీ చేయాలని కౌన్సిలర్ జయశ్రీ వినతిపత్రంలో పేర్కొన్నారు.