జీవన్ రెడ్డి ఇంటికి జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడ్వాల జ్యోతి !


👉ఏ నిమిషానికి ఏమి జరుగునో..


J.SURENDER KUMAR,


జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ గా బుధవారం ఎన్నికైన బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి అడ్వాల జ్యోతి – లక్ష్మణ్ ఎన్నికైన వెంటనే గెలుపుకు సహకరించిన కౌన్సిలర్లతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో నివాసంలో ఉన్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు, మాజీ మున్సిపల్ చేర్మెన్స్ గిరి నాగభూషణం, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్, కాంగ్రెస్ నాయకులు తాటిపర్తి రాంచంద్ర రెడ్డి లను వారు మర్యాద పూర్వకంగా కలిశారు.

మున్సిపల్ చేర్మెన్ అడ్వాల జ్యోతి – లక్ష్మణ్ మాట్లాడుతూ
ఎన్నికలో పాల్గొని ఓటు వేసిన వారి అందరికి నా ధన్యవాదాలు పార్టీలకు అతీతంగా అందరు నాకు ఓటు వేశారు అందరికీ కృతజ్ఞతలు పార్టీలకు అతీతంగా అందరిని కలుపుకొని ముందుకు వెళ్తాను ఉన్న కొద్దీ సమయంలో అభివృద్ధిలో ముందు నిలపడతానని తెలిపారు


భారత రాజ్యాంగ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం జగిత్యాల మున్సిపల్ చైర్మన్ బీసీ మహిళ కేటాయించడం వల్ల ఆ యొక్క సీటు కొరకు పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ప్రత్యేక బీసీల అభ్యున్నతి కొరకు బీసీల స్థానంలో బీసీలే అనుభవించాలని దానిలో భాగంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలపడానికి జీవనన్న నివాసానికి వచ్చాను అని అన్నారు ఈ అవకాశం కలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ నాయకులు పూలమాల శాలువలతో సన్మానించారు…

రేపు మా పో కాంగ్రెస్ లో చేరిక ?

జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ గా బుధవారం ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీ తిరుగుబాటు అభ్యర్థి ఆడవాల జ్యోతి, భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కౌన్సిలర్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ లో చేరనున్నట్టు చర్చ.