👉 ఇది రాజకీయ సభ కాదు – ఉద్యమ సభ, పోరాట సభ”
👉 నల్గొండ బహిరంగ సభ లో మాజీ సీఎం కెసిఆర్..
J.SURENDER KUMAR,
కాలు విరిగినా కట్టె పట్టుకుని నల్గొండకు వచ్చాను ఇది రాజకీయ సభ కాదు – ఉద్యమ సభ, పోరాట సభ” అని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించిందని బీఆర్ఎస్ ప్రజా ఉద్యమానికి మంగళవారం శంఖారావం పూరించింది.
మాజీ సీఎం కేసీఅర్ కామెంట్స్..
👉 శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్ని కేఆర్ఎంబీకి అప్పగించినందుకు నిరసనగా నల్గొండలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని కృష్ణా జలాలు పరిరక్షించుకునేందుకు అనారోగ్యాన్ని లెక్క చేయకుండా వచ్చానని కేసీఆర్ అన్నారు.
👉కృష్ణా జలాల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఇదని కేసీఆర్ అన్నారు. నీళ్లు లేకపోతే తెలంగాణ ప్రజలకు బతుకు లేదని 24 ఏళ్లుగా పక్షిలాగ తిరగుతూ రాష్ట్రం మొత్తం చెప్పానని తెలిపారు. ఫ్లోరైడ్ వల్ల నల్గొండ ప్రజల నడుములు వొంగిపోయాయని, బాధితులను దిల్లీకి తీసుకెళ్లి అప్పటి ప్రధానికి చూపించినా వారు పట్టించుకోలేదని విమర్శించారు.
👉రాష్ట్రంలో తమ ప్రభుత్వం వచ్చాకే నల్గొండలో ఫ్లోరైడ్ సమస్య పోయిందని వెల్లడించారు. ఇప్పుడు నల్గొండ జిల్లా పూర్తిగా ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మారిందని వివరించారు.
చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చింది తానని, తెలంగాణ కోసం ఏదైనా అడిగే గర్జు, హక్కు తనకుంది అని కేసీఆర్ అన్నారు.
👉 ‘మళ్లీ మనమే వస్తాం.. అనుకున్నవి చేస్తాం’ అని వ్యాఖ్యానించారు. కరెంటు కోసం ఎక్కడికక్కడ నిలదీయాలని, చలో నల్గొండతోనే ఆపమని రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎక్కడికక్కడ నిలదీస్తామని స్పష్టం చేశారు.
👉ప్రభుత్వాన్ని నిలదీసే ప్రతిపక్షం బాధ్యత తమకు ఇచ్చారన్న కేసీఆర్,
👉బీఆర్ఎస్ సర్కారు తరహాలోనే ఈ ప్రభుత్వం కూడా కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో కూడా జనరేటర్ పెట్టే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.
👉కృష్ణా జలాల హక్కు అనేది తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య…..
👉24 ఏళ్లుగా కృష్ణా, గోదావరి జాలాల సాధన కోసం పోరాటం చేశాం….
👉బీఆర్ఎస్ పాలనలో ఫ్లోరోసిస్ మహమ్మారిని తరిమికొట్టాం…
👉నల్గొండ సభ రాజకీయ సభ కాదు…కృష్ణ జలాల హక్కుల కోసం పోరాటం…
👉నల్గొండ పోరాట సభ కేంద్రానికి,సహకరిస్తున్న ప్రభుత్వాలకు హెచ్చరిక కావాలి…..
👉పదేళ్ల తమ పాలనలో ఇంటింటికీ తాగు నీరు,24 గంటల విద్యుత్ వెలుగులు అందించాం….
👉ఆముదాలు మాత్రమే పండే భూముల్లో వరి పంట సాగేలా నీరందించాము…
👉ఇన్నేళ్లుగా కేంద్రంతో కొట్లాడి నీటి వాటాల హక్కులను సాధించాం….
👉కేంద్రంతో కొట్లాడి నీటి హక్కులను సాధించాల్సిన భాధ్యత పవర్ లో ఉన్న ప్రభుత్వానిది….
👉తెలంగాణ ప్రజలు పాలిచ్చే గేదేను వదిలి..పనికిరాని దున్నపోతును తెచ్చుకున్నారు…..
👉ఢిల్లీకి అఖిల పక్షం తేసుకుపోవాలి
ప్రధాని కలిసి కలిసి నిలదీయాలి
👉మాయమాటలు వదిలిపెట్టు..
పాలమూరు పూర్తి చేయాలి
👉ఐదేళ్లు ఉండండి… మా కంటే బాగా చేయండి
నేను రెస్ట్ తీసుకుందాం అనుకున్నా వచ్చిన వెంటనే కేంద్రానికి అప్పగించి నాకు పని పెట్టారు నా ప్రభుత్వం పడగొడతం అన్నా నేను KRMB కి అప్పగించలేదు