కేసీఆర్ ఉద్యమం చేయకపోతే తెలంగాణ వచ్చేదా ?


మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్..


.SURENDER KUMAR,


కేసీఆర్ ఉద్యమం చేయకపోతే తెలంగాణ వచ్చేదా ? ప్రతి పల్లె అభివృద్ధి జరిగేదా.?. కాంగ్రెస్ సర్కారు పనిచేయలేకనే కేసీఆర్ సర్కారుపై నిందలు మోపుతున్నారు అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.


స్థానిక శ్రీ లక్ష్మీ నృసింహ గార్డెన్ లో బుధవారం ధర్మపురి నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల విసృత సమావేశంలో పాల్గొన్న తెలంగాణ తొలి శాసన సభ స్పీకర్, ప్రస్తుత శాసన మండలి సభ్యులు పరిశీలకులు మధుసూదన చారి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్యమ్మ, వైస్ చైర్మన్ ఐ రామయ్య, ఎంపీపీ చిట్టిబాబు, రైతు మండల కన్వీనర్ సౌల భీమయ్య, డిసిఎంఎస్ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి ధర్మపురి నియోజకవర్గ బీ ఆర్ ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ..
గ్యారంటీలకు ప్రాధాన్యత ఇవ్వని కాంగ్రెస్ సర్కారు, టీఎస్ ను టీజీ గా మార్పుకు, తెలంగాణ తల్లి మార్పునకు ప్రాధాన్యతనిస్తోంది అన్నారు. కోటి ఎకరాలకు నీరందించిన ఘనత కేసీఆర్ సర్కార్ ది కాదా రాష్ట్ర వ్యాప్తంగా అధునాతన ప్రభుత్వ ధవాఖానాలు, మెడికల్ కళాశాలలు, అభివృద్ధి కాంగ్రెస్ సర్కారుకు కనిపిస్తాలేవా ? అంటూ ప్రశ్నించారు.
100 రోజుల తర్వాత బీఆర్ ఎస్ శ్రేణులు పోరాటానికి సిద్ధం కావాలె, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రేవంత్ వ్యాఖ్యలు సీఎం స్థాయికి తగవు అన్నారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి, తదితర నాయకులు ముఖ్య కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.