కూలింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు ప్రజల నమ్మకం సీఎం రేవంత్ రెడ్డి!

👉మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్ష సమావేశంలో ..


J. SURENDER KUMAR,

కూలింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు తెలంగాణ ప్రజల నమ్మకమని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. కుంగింది మేడిగడ్డ పిల్లర్లు కాదు 4 కోట్ల ప్రజల ఆశలని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు, పాత్రికేయుల మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్ట్​లో జరిగిన లోపాలను వెలికితీసేందుకు ఆ ప్రాజెక్ట్​ను సందర్శించారు. ఈ టూర్​లో భాగంగా అక్కడే పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ నిర్వహించారు. అనంతరం మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

👉సీఎం సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్..

👉కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామనడం పచ్చి అబద్ధం

👉లక్ష కోట్లు ఖర్చు చేసి కనీసం లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదు.

👉₹.94 కోట్లు ఖర్చు చేసి నీళ్లు ఇచ్చింది 98, 570 ఎకరాలకు మాత్రమే.

👉కేవలం కరెంటు బిల్లులే ప్రతీ ఏటా ₹ 10, 500 కోట్లు ఖర్చవుతోంది.

👉ప్రతీ ఏటా బ్యాంకు రుణాలు, ఇతరత్రా చెల్లింపులకు ₹ 25వేల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి.

👉ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి కావడానికి దాదాపు ₹ 2 లక్షల కోట్లు ఖర్చవుతుంది.

👉ఇప్పటి వరకు అబద్ధపు ప్రచారాలతో కేసీఆర్ కాలం గడిపారు.

👉2020లోనే ఈ బ్యారేజీకి ముప్పు ఉందని అధికారులు ఎల్&టీ కి లేఖ రాశారు.

👉సమస్యను పరిష్కరించకుండా ముందుకు వెళ్లడం వల్లే బ్యారేజీకి ఈ పరిస్థితి తలెత్తింది.

👉మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ను ఒకే రకమైన టెక్నాలజీతో నిర్మించారు.

👉మూడు బ్యారేజీల్లో ఎక్కడా నీళ్లు లేవు.

👉నీళ్లు నింపితే కానీ భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు రాబోతున్నాయో తెలియని పరిస్థితి.

👉ఎన్నికల ముందు ఇష్యూ అవుతుందనే ఈ బ్యారేజీల్లో నీళ్లు లేకుండా చేశారు.

👉మేడిగడ్డ సందర్శనకు బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు .
👉 బీఆర్ఎస్​, బీజేపీ బంధం అందరికీ తెలిసిందే.

👉మేడిగడ్డ ప్రాజెక్టులో కేసీఆర్‌ అవినీతిని బీజేపీ సమర్థిస్తుందా ?

👉కుర్చి పోగానే కేసీఆర్‌కు నీళ్లు, ఫ్లోరైడ్‌ గుర్తుకు వచ్చాయి.

👉కేసీఆర్‌ శాసనసభకు వచ్చి ప్రజల తరఫున మాట్లాడాలి.

👉కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించింది కేసీఆర్‌ సర్కార్

👉 ప్రాజెక్టులను కేంద్రం నిర్వహించేందుకు కేసీఆర్ సర్కార్‌ నిధులు కూడా ఇచ్చింది.

👉వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ప్రాజెక్టు కుంగితే చిన్న విషయంగా మాట్లాడుతున్నారు.

👉 మేడిగడ్డపై సీబీఐ కంటే ఉన్నతమైన విచారణను కోరాము

👉 న్యాయస్థానాలపై బీజేపీ నేతలకు నమ్మకం లేదా ?

👉 సీబీఐ విచారణ జరిపించి కేసీఆర్‌ను రక్షించాలని చూస్తున్నారు.

👉 వరంగల్‌కు వచ్చిన కిషన్‌రెడ్డి మేడిగడ్డకు ఎందుకు రాలేదు.

👉 కుర్చి పోగానే కేసీఆర్‌కు నీళ్లు, ఫ్లోరైడ్‌ గుర్తుకు వచ్చాయి.

👉 కేసీఆర్‌ శాసనసభకు వచ్చి ప్రజల తరఫున మాట్లాడాలి

👉కాళేశ్వరం ప్రాజెక్ట్​పై​ సీఎం రేవంత్​ రెడ్డి ట్వీట్​


ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం కేసీఆర్ ధనదాహానికి బలైందని సీఎం రేవంత్​ రెడ్డి ఆరోపించారు. ₹ 97 వేల కోట్లు ఖర్చు చేసి 97 వేల ఎకరాలకూ నీళ్లివ్వలేదని మండిపడ్డారు.
డిజైన్ నుంచి నిర్మాణం వరకు అన్నీ తానై కట్టానని కేసీఆర్ చెప్పారని తెలిపారు. మేడిగడ్డ కూలి నెలలు గడిచినా కేసీఆర్‌ నోరు విప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డను మళ్లీ నిర్మించాలని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చెప్పిందని గుర్తు చేశారు. ప్రజలకు నిజాలు చెప్పాలనే ప్రజాప్రతినిధుల మేడిగడ్డ పర్యటన చేస్తున్నామని పేర్కొన్నారు.
కేసీఆర్‌ సహా బీఆర్ఎస్​ ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించామని, వారితో పాటు బీజేపీ సభ్యులు కూడా మేడిగడ్డ సందర్శనకు రాలేదని ఆయన అధికార ఎక్స్​ ఖాతాలో ట్వీట్​ చేశారు.